NewsOrbit
Featured రాజ‌కీయాలు

గంటాకు జగన్ స్టైల్ పంచ్…! చేరికలో పెద్ద మెలిక…!!

పాపం గంటా శ్రీనివాసరావు..! ప్రతిపక్షంలో అసలు కూర్చోలేకపోతున్నారు. పార్టీ మారకుండా ఉండలేకపోతున్నారు. పదవి లేకుండా తట్టుకోలేకపోతున్నారు. ఎలాగోలా ఏడాది గడిపేశారు. కానీ ఆయన చేసిన కొన్ని అవినీతి వ్యవహారాలను వైసీపీ ప్రభుత్వం తవ్వుతుండడం.., ఆయన కీలక అనుచాలురు అరెస్టవుతుండడంతో గంటాకు కూడా చెమటలు పడుతున్నాయి. అందుకే వైసిపిలోకి జంపింగ్ కి సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మంత్రి అవంతి రూపంలో గంటాకు అప్పుడే ధిక్కారం మొదలయింది. అందుకే ఇటీవల జగన్ ని కలిసిన గంటా కొన్ని షరతులు పెట్టారట… ఆయనకు జగన్ తన స్టైల్ లో పంచ్ ఇవ్వడంతో చేరిక విషయంలో కీలక మెలిక పడినట్టు చెప్తున్నారు.

పదవి కావాలి : గంటా ! మళ్ళీ గెలిచి రండి : జగన్..!

గంటా శ్రీనివాసరావు గడిచిన రెండు ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేసారు. బాగానే వెనకేసుకున్నారు. పైకి కనిపించవు కానీ ఆయనపై అనేక అవినీతి మచ్చలు, మరకలు ఉన్నాయి. మేడిపండు పొట్ట విప్పితే పురుగులున్నట్టు ఆయన అంతర్లీన వ్యవహారాలన్నీ అవినీతి మయమే. కానీ ఇవేమి బయటకు రావు. ఆయన మేనేజ్మెంట్ అటువంటిది. దానిలో భాగంగానే ఆయన వైసిపిలోకి వచ్చేయాలని ఉవ్విల్లూరుతున్నారు.

 

అయితే తనకు మంత్రి పదవి కావాలంటూ సీఎం జగన్ ని అడిగారట. “తానూ గత రెండు ప్రభుత్వాల్లోనూ మంత్రిగా చేశానని, ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే వరుసగా మూడు ప్రభుత్వాల్లోనూ చేసిన అరుదైన ఘనత తనకు దక్కుతుందని” జగన్ ని రిక్వెస్ట్ చేశారట. దీనికి జగన్ “అలాగే అన్నా..! మీరు రాజీనామా చేసి, మంచి ఆధిక్యతతో గెలిచి రండి చూద్దాం” అంటూ సింపుల్ గా పంచ్ వేసారట. అసలే ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం ఎంచుకుని చాలా జాగ్రత్తగా రాజకీయం నడిపించే గంటాకు జగన్ చెప్పిన రాజీనామా విషయం అసలు నచ్చలేదని సమాచారం.

ఆ ముగ్గురిలా ఉంటె ఆగష్టు 16 ముహూర్తం…!!

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వదిలి, వైసిపికి వెళ్లిపోయారు. పరోక్షంగా జగన్ సభ్యులైపోయారు. గంటాతో కలిసి ఆ నలుగురుగా మారిపోతారు. అయితే ప్రస్తుతం గంటా వ్యవహారం ఇంకా చర్చల దశలోనే ఉంది. మంత్రి అవంతి గంటాని టార్గెట్ చేస్తుండడం.., మరోవైప్పు టీడీపీని వీడిన వెంటనే గంటాపై చెలరేగడానికి.., ఘాటు వ్యాఖ్యలు చేయడానికి మాజీ మంత్రి అయ్హన్న సిద్ధంగా ఉండడం గంటాని కలవర పెడుతుంది. పార్టీ మారిన తర్వాత సొంత పార్టీ అంటే వైసిపిలో ఎవరూ విమర్శించకుండా చూడాలని పార్టీ పెద్దలను కోరారట. అందుకు సరే అంటే.., అంతా ఒకే అనుకుంటే గంటా ఈనెల 16 సైకిల్ దిగిపోయి జగన్ కి మద్దతు పలకనున్నారు. లేకపోతే జాప్యం తప్పదు.

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?