NewsOrbit
రాజ‌కీయాలు

కథలన్నీ కంచికి… ఏపీ వివాదాలన్నీ కోర్టుకి..!!

TTD Board: Jambo But Political Combo

కథలన్నీ తిరిగి తిరిగి కంచికి చేరినట్టు ఏపీలో వివాదాలన్నీ చుట్టుముట్టీ అన్ని పార్టీలను తాకి చివరికి కోర్టులకు చేరుతాయి. హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు చేరుతాయి. సుప్రీం చెప్పిందే ఫైనల్ అవుతుంది. గడచిన ఏడాదిన్నరగా ఏపీలో ఇదే జరుగుతోంది. ఇటివల రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన టీటీడీ డిక్లరేషన్ కూడా రాజకీయంగా కుదిపేసిన సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి ఈ తేనెతుట్టెను కదిపారు. కొడాలి నాని వాఖ్యలు ఈ అంశాన్ని వివాదాస్పదంగా మార్చేశాయి. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది.

cm jagan ttd declaration issue in high court
cm jagan ttd declaration issue in high court

తాజాగా హైకోర్టులో ట్విస్ట్ ఏంటంటే..

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది దేవాదాయ చట్టం ప్రకారం సెక్షన్ 97, 153 కు విరుద్ధమని గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు, నిబంధనల అమల్లో విఫలమైన తితిదే ఛైర్మన్, ఈవో తమ విధుల్లో కొనసాగకుండా చూడాలని తన పిటిషన్ లో కోరారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకునేలా ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

అనేక కేసుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు..

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం దగ్గర నుంచీ మొదలైన కోర్టు కేసులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రైవేటు వ్యక్తులు ఎవరొకరు కోర్టుకు వెళ్తున్నారు. వీటిలో అత్యధిక  శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినవే. ఇప్పుడు మరోసారి టీటీడీ డిక్లరేషన్ అంశంపై సీఎం తీరుపై కోర్టుకు వెళ్లారు. ఇప్పటికే అనేక కేసుల్లో ప్రభుత్వానికి అనుకోని చిక్కులు వస్తున్నా నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !

CM YS Jagan: సీఎం జగన్ పై దాడి .. ప్రధాని మోడీ సహా స్పందించిన ప్రముఖులు

sharma somaraju

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju