NewsOrbit
రాజ‌కీయాలు

సీఎం జగన్ X నిమ్మగడ్డ.. మళ్ళీ పోరు మొదలైనట్టేనా..!?

cm jagan vs ap cec war begins

ఏపీలో ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య మళ్లీ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్.. మరోపక్క ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటి మధ్య ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తోందే కానీ.. ఎవరూ కూడా తగ్గేలా లేరు. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు.

cm jagan vs ap cec war begins
cm jagan vs ap cec war begins

హైకోర్టు ఏమందంటే..

ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఇవ్వడం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రిట్ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కు సహకరించాలని సూచించింది. నిదుల విషయంలో ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా అని ప్రశ్నించింది. అయితే.. తాము రూ.40 లక్షలకుగాను రూ.39 లక్షలు ఇప్పటికే విడుదల చేశామని దీనిపై ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ.. ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ సంప్రదించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం ఏయే విషయాల్లో సరిగా సహకరించడంలేదో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది.

మళ్లీ వార్ తప్పదా..

నిజానికి ప్రభుత్వానికి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు. నిమ్మగడ్డను తప్పించినా కోర్టు ఉత్తర్వులతో ఆ పదవిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. గతంలో కూడా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని కూడా కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల కమిషన్ కు నిధులు ఎక్కువగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిధుల గురించి చెప్తూ.. ఎన్నికల నిర్వహణకు నిధుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు నిమ్మగడ్డ. దీనిపై మళ్లీ కోర్టు స్పందించింది. నిజానికి నిమ్మగడ్డ ఆ పదవిలో ఉన్నంతవరకూ ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం లేదు. కానీ.. కోర్టుకు వెళ్లైనా ఎన్నికలు నిర్వహించాలనేది నిమ్మగడ్డ ఆలోచన. మరి వీరిద్దరి వాదనలో హై’కోర్టు’లో ఎన్నికల బంతి ఉంది. మరి ఆ బాల్ ను ఎవరి వైపు అనుకూలంగా విసురుతుందో కోర్టు మాత్రమే నిర్ణయించాలి.

author avatar
Muraliak

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju