కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ..! ఎందుకంటే..!?

Share

 

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల గురించి వివరిస్తూ..దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం వాటిల్లిందనీ, కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణంగా కనీసం వెయ్యి కోట్లు కేంద్రం నుండి మంజూరు చేసి ఆదుకోవాలని లేఖలో జగన్ కోరారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరంలో అత్యధికంగా 265.10 మిమీ వర్షపాతం నమోదు కాగా అదే జిల్లాలోని కాట్రేనికోటలో 228.20 మిమీ. తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో రూ.204.02 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అదే విధంగా ఎగువన తెలంగాణ, మహరాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రహదారులు దెబ్బతిన్నాయనీ, పలు చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిపైనా వర్షాల ప్రభావం పడిందన్నారు. ఈ వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారని, ముఖ్యంతో చేతికి వచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజెన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ వివరించారు.

వరద సహాయక చర్యల్లో భాగంగా ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ టీ ఆర్ ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసినప్పటికీ 14మంది మృతి చెందారన్నారు. వివిధ శాఖల ప్రాధమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే కోవిడ్ 19 తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాలని కోరారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల నిర్వహించి తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకురావడం కోసం తక్షణమే ముందస్తుగా కేంద్రం నుండి వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు జగన్. అదే విధంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరారు.


Share

Related posts

వైసీపీ బీసీ నేతలకు పదవుల పందేరం..!

Special Bureau

Job update: ఎన్ పీసీఐఎల్ నోటిఫికేషన్..!!

bharani jella

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో తీవ్ర అస్వస్థత..

Special Bureau