NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ ధైర్యం అదేనా..!? | జగన్ హ్యాండ్ ఇస్తారా!?

cm kcr against bjp and pm modi

KCR: కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటమే గుర్తొస్తుంది. రాష్ట్రం సాధించి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి సీఎంగా ఉన్నారు. అయితే.. రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి పీఠంతో కేసీఆర్ లక్ష్యం పూర్తవలేదా..? ప్రధాని పదవి వైపు చూస్తున్నారా..? అంటే.. ప్రస్తుతం ఆయన తీరు అదే తలపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. కానీ.. ఈసారి తగ్గేదేలే.. అనేట్టుంది ఆయన తీరు. మొన్న ప్రెస్ మీట్ లో బీజేపీ, మోదీపై నిప్పులు చెరగడం, నిన్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు గైర్హాజరీ.. ఇదే నిరూపిస్తోంది.

cm kcr against bjp and pm modi
cm kcr against bjp and pm modi

KCR ఈసారి గట్టిగానే కేసీఆర్..

హైదరాబాద్ లో విమర్శించి.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇస్తారనే కామెంట్స్ కేసీఆర్ పై ఉన్నాయి. ఈసారి వాటికి చెక్ పెట్టేలా నిన్న ఆయన తీరు ఉందని చెప్పాలి. ప్రధాని వచ్చినా ఆహ్వానించలేదు.. కార్యక్రమాల్లో కేసీఆర్ ఉండాల్సి ఉన్నా పాల్గొనలేదు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు తనవైపు చూసేలా వ్యవహరించారని చెప్పాలి. రాజకీయంగా మోదీని ఢీకొట్టాలని ఎందరికి ఉన్నా.. మమతా బెనర్జీ తప్పితే ఎవరూ కనిపించరు. కానీ.. మొన్న బడ్జెట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా రెండున్నర గంటలు బీజేపీని, మోదీని ఏకిపారేశారు. ఆయన ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానమే లేదు. ఇదంతా 2024 ఎన్నికల ముందు పూరించిన శంఖమా..? ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే వ్యూహమా..? వీటి వెనుక ఎవరున్నారు..?

పీకే వ్యూహమేనా..

ఇటివలే ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ కోసం పని చేయడం ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ప్రెస్ మీట్, ప్రధాని మోదీ పర్యటన జరిగాయి. రెండింటిలో కేసీఆర్ వెనుక పీకే మార్క్ కనిపిస్తోందనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ కు అండగా బీజేపీకి వ్యతిరేకి అయిన పీకే ఉన్నారనే ధైర్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా సీఎం జగన్ బీజేపీని వ్యతిరేకించి పీకే ద్వారా కేసీఆర్ కు దగ్గర కావొచ్చనే ఊహాగానాలు లేకపోలేదు. ఏదేమైనా.. మోదీకి మొన్న పంజాబ్ లో ఓ షాక్.. ఇప్పుడు తెలంగాణలో మరో షాక్. మొత్తంగా.. బీజేపీ, మోదీని గద్దె దించేందుకు కొత్త శక్తులు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రాబోయే రోజుల్లో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో చూడాల్సి ఉంది..!

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!