రాజ‌కీయాలు

KCR: రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులతో సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..!!

Share

KCR: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు రంజాన్ నెల ని చాలా పవిత్రంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో పాటిస్తుంటారు. ఒక నెలలోనే ఖురాన్ మొత్తం చదవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ నెలలో చాలామందికి దానాలు… పేదవాళ్లకు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.  మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. రంజాన్ మాసం పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు.. ఈనెల 29వ తారీఖున ఇఫ్తార్ విందు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

Holy month spreads spirit of brotherhood

ఈ నెల 29 సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో .. ముస్లిం మత పెద్దలు మరియు మైనార్టీ నాయకులు… ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు మతసామరస్యానికి… గంగా జమున తెహజీబ్ కి వేదికగా నిలిచింది అని అన్నారు. సర్వ మతాలకు సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు… ప్రాధాన్యత నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. అందరిని గౌరవిస్తుందని తెలిపారు. ముస్లిం మైనార్టీ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నట్లు లౌకిక వాదాన్ని కాపాడడంలో ఎప్పుడో కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది.. అని సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. YS Jagan Ramzan: కష్టమైనా తప్పదు.. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు: సీఎం జగన్ -  cm jagan appeal to muslims that will conduct ramzan prayers at home amid of  corona crisis | Samayam Teluguఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో… దాదాపు 5000 మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు… రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు… ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చూసుకుంటున్నారు. ముస్లిం లకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకి ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హాజరుకావాలని అంజాద్ బాషా ఇప్పటికే.. పిలుపునివ్వడం జరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో.. ఇరు ముఖ్యమంత్రులు.. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది.


Share

Related posts

విజయసాయికి జగన్ కి ఎక్కడ చెడింది..??

somaraju sharma

vizag :విశాఖ ఎంపీ దుమారం..! వైసిపీలో కొత్త చర్చ..!!

Muraliak

బ్రేకింగ్ : ఏపీ లో ప్రత్యేక ఆపరేషన్ కు పచ్చ జెండా ఊపిన డీజీపీ..! రాష్ట్రంలో వారే టార్గెట్

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar