సీఎం రమేష్ గుండు చేయించుకున్నారు

తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.  తన చిరకాల వాంఛ నెరవేరడంతో తలనీనాలు సమర్పించుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి పార్లమెంట్‌లో ప్రస్థావిస్తానన్నారు.