NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Stalin: స్టాలిన్ తెలివైన నిర్ణయం..! కరోనాపై పోరులో అందరినీ కలిపి ముందుకు..

cm stalin sensible decision

Stalin: స్టాలిన్ Stalin తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారనే విషయం తెలిసిందే. డీఎంకే అధికారంలోకి వచ్చింది.. ఆయన సీఎం అయ్యారు. ఇది పెద్ద విషయం కాదు కానీ.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలకు వేదిక అవుతున్నాయి. సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది. అధికారం వచ్చింది కదా అని .. ‘మాకంతా తెలుసు.. మా ప్రభుత్వం మాత్రమే పనులన్నీ చేయగలదు.. అంతా మేమే..’ అనే సదరు రాజకీయ భావనకు ఆయన దూరమని నిరూపిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో కరోనాపై పోరుకు 13 మంది ఎమ్మెల్యేలతో ఓ సలహా కమిటీని నియమించి.. అందులో 12 మంది విపక్ష సభ్యులనే తీసుకోవడం సంచలనం రేపుతోంది.

cm stalin sensible decision
cm stalin sensible decision

స్టాలిన్ కు సీఎం పీఠం కొత్త కావొచ్చు కానీ.. రాజకీయాలు కొత్త కాదు. తండ్రి సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. ఆ అనుభవంతోనే ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పాలి. పైగా.. ఈ కమిటీలో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన విజయ్ కుమార్ ను కూడా భాగస్వామిని చేశారు. స్వయంగా ఆయనే సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ తమ అనుభవంతో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటన చేశారు. సమకాలీన రాజకీయాల్లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల ప్రభుత్వం విపక్షాలతో కలిసి కరోనాపై పోరు సాగిస్తుంది. సలహాలతో ముందుకెళ్తుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు, ఆరోపణలకు తావుండదు.

Stalin released the DMK manifesto

సమకాలీన రాజకీయాల్లో ఇటువంటి విధానాన్ని ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం తీసుకునే చర్యల్లో విపక్షాలను కలుపుకుని ముందుకెళ్లడం వల్ల ప్రభుత్వానికి కూడా పని సులువు అవుతుంది. స్టాలిన్ రాజకీయ పరిణితి ఇందుకు దోహదపడిందని చెప్పాలి. ఇటివలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. కమిటీలో స్టాలిన్ చైర్మన్ గా ఉంటారు. మిగిలిన సభ్యుల్లో ఎజిలన్-డీఎంకే, విజయభాస్కర్-అన్నాడీఎంకే, జీకే మణి-పీఎంకే, ఏఎం మణిరత్నం-కాంగ్రెస్, నగర్ నాగేంద్రన్-బీజేపీ, సుశాన్ తిరుమలైకుమార్-ఎండీఎంకే, ఎస్ఎస్ బాలాజీ-వీసీకే, టి.రామచంద్రన్-సీపీఐ, జవహరుల్లా-ఎంఎంకే, ఆర్ ఈశ్వరన్-కేఎండీకే, టీ.వేల్ మురుగున్-టీవీకే, పూవై జగన్ మూర్తి-పీబీ, నాగై మాలి-సీపీఎం.. పార్టీల వారు ఉన్నారు.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!