NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ys Vivekananda Reddy : వివేకా వర్ధంతికి సీఎం జగన్ గైర్హాజరు..! అందుకేనా..!?

YS Viveka Case: CBI Third Phace Started

Ys Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి Ys Vivekananda Reddy మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతికి ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఈ విషయం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించేందుకు విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. వీరితోపాటు వివేకా కుమార్తె సునీత మరికొందరు బంధువులు హాజరై నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతి కూడా హాజరు కాలేదు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిల హాజరయ్యారు. జగన్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.

cm ys jagan absent for Ys Vivekananda Reddy death anniversary
cm ys jagan absent for Ys Vivekananda Reddy death anniversary

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మొదట్లో గుండెపోటుతో చనిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ.. ఆయన దారుణ హత్య రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఆ సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఎన్నికలకు సరిగ్గా 28 రోజుల ముందు ఈ హత్య జరిగింది. అనేక మలుపుల తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. వివేకానంద కుమార్తె డాక్టర్ సునీత ఈ విషయంలో న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరళలో సామాజిక కార్యకర్త జోమున్ ని కలవడం సంచలనం రేపింది. తండ్రి మరణంపై ఇప్పటికీ సరైన విచారణ జరగడం లేదనేది సునీత వాదన. ఆమధ్య సీబీఐ కూడా మళ్లీ పులివెందుల వెళ్లి విచారణ ప్రారంభించింది.

అయితే.. సీఎం జగన్ ప్రస్తుతం తీరక లేనంతగా బిజీగా ఉన్నారు. ఇటివలే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయం లభించింది. మరో రెండు రోజుల్లో మేయర్ల ఎన్నిక ఉంది. ఎవరిని మేయర్ గా ఎన్నుకోవాలనే అంశంపై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆశావాహులు అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ ఈ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పులివెందుల వెళ్లేందుకు సమయం చిక్కలేదని తెలుస్తోంది. అయితే.. షర్మిల హాజరుకావడంతో మరోసారి వివేకా వర్ధంతికి సీఎం వైఎస్ జగన్ గైర్హాజరీ చర్చనీయాంశమైంది.

author avatar
Muraliak

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!