NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ మారుతున్నారా..!? దారిలోకి తెస్తున్నారా..!?

Big Breaking ap cm jagan announced employees prc

YS Jagan: రాజకీయ పార్టీని నడిపించడం కష్టం.. కానీ, అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడిపించడం చాలా తేలిక. కారణం.. ఒక వ్యవస్థ, అధికారులు, అధికారం.. ఉంటుంది కాబట్టి.. వాళ్లని వెనకుండి నడిపిస్తే చాలు.. నడిచిపోద్ది. కాకపోతే.. ఐఏఎస్ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ.. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఈ విషయం ముఖ్యమంత్రులకు ఒకరు చెప్పేది కాదు. మహామహులు అనదగ్గ సీఎంలకు, రాజకీయ ఉద్దండులకు తెలిసిన విషయమే. అయితే.. (YS Jagan) సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఇంకా పరిస్థితి అర్ధం కానట్టుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.. నేను సీఎం అయ్యాక వారంలో సీపీఎస్ రద్దు.. ఇంకా వారిని ఆకర్షించే హామీలు ఇచ్చి జగన్ అప్పట్లో ఆకట్టుకున్నారు. కానీ.. సీఎం అయ్యాక అదే ఉద్యోగులతో ఆటలాడుతున్నారు.

cm ys jagan meeting with employees
cm ys jagan meeting with employees

ఉద్యోగస్థులం కుటుంబాలతో కలిసి 60 లక్షల మంది ఉంటాం. మాతో పెట్టుకుంటే ప్రభుత్వం మారిపోద్ది అని ఉద్యోగ సంఘాల నాయకుడు చేసిన వ్యాఖ్య (YS Jagan) జగన్ ను కలవరపెట్టే మాట. దీంతో కమిటీ అన్నారు.. పీఆర్సీ అమలు అన్నారు.. కానీ.. ఇప్పటి వరకూ ఏదీ ఓ కొలిక్కి అయితే రాలేదు. ప్రభుత్వ పధకాలు ప్రజలకు వెళ్లాలంటే అధికారులు కావాలి. కానీ.. ఆ అధికారులకు ప్రభుత్వం బాధ్యతగా పెంచాల్సిన జీతాలు మాత్రం పెంచడం లేదు. పధకాలతో లబ్ది పొందిన వారు ఓట్లు వేసినా.. ఒక పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే అధికారుల సహకారం తప్పనిసరి. కానీ.. జగన్ ఇదే విస్మరిస్తున్నారు. ఎన్నో భేటీలు.. ఎన్నో చర్చలు.. కానీ.. నిర్ధిష్టంగా ఇంత పెంచుతామని మాత్రం చెప్పడం లేదు.

దీనిపై తుది అంకంగా నేడు (YS Jagan) సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. కమిటీలు ఎన్ని నివేదికలు ఇచ్చిన సీఎం మాటే ఫైనల్. అయితే.. సీఎం పీఆర్సీ ఇచ్చే ఫిగర్ ఉద్యోగ సంఘాలకు నచ్చుతుందా అనేదే పాయింట్. నా రూటే సపరేటు.. అన్నట్టు జగన్ వెళ్తే ఉద్యోగులు ఊరుకోరు. కానీ.. సీఎం జగన్ కు లేని తలనొప్పిని కోరి తెచ్చుకోవడం ప్రతి విషయంలోనూ అలవాటైందే. కానీ.. ఈసారి ఉద్యోగులు మెచ్చే మాట చెప్తే.. మరో రెండేళ్లు కాదు.. మరో అయిదేళ్లూ కాచుకుంటారు. కానీ.. జగన్ ఆ పని చేస్తారా.. చూడాలి..!

author avatar
Muraliak

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju