NewsOrbit
రాజ‌కీయాలు

టీఆర్ఎస్ కు ఈసారి గట్టిగా ఎసరు పెడుతున్న కాంగ్రెస్, బీజేపీ..!!

congress and bjp to give big jolt to trs

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ అక్కడ కేసీఆర్, కేటీఆర్ హవానే నడుస్తోంది. వారేం చెప్తే అది ఆ రాష్ట్రంలో జరగాల్సిందే. జరుగుతోంది కూడా. చట్టం అమలు, శిక్ష కూడా వారిదే. ఏకంగా రాష్ట్రమే వారిది అన్నట్టుగా హవా కొనసాగుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సహకరించిన బీజేపీ పాత్రే లేదన్నట్టు చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. దీంతో.. ఇలా ఎన్నాళ్లు అనే ప్రశ్న ఆ రెండు పార్టీల్లో మొదలైంది. కనీసం జీహెచ్ఎంసీని అయినా చేజిక్కించుకోకపోతే ఎలా? అందుకే ఆ జాతీయ పార్టీలు తమ వ్యూహాలతో ఈసారి టీఆర్ఎస్ ను పక్కాగా ఫిక్స్ చేసే పనిలో పడ్డాయి.

congress and bjp to give big jolt to trs
congress and bjp to give big jolt to trs

సుదూర లక్ష్యానికి కాంగ్రెస్ గురి..

2014 ఎన్నికల్లో ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అన్న కాంగ్రెస్ మాటలు అరణ్యరోదనే అయ్యాయి. తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పెద్దల్లో చాలామంది టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కాంగ్రెస్ బలహీనపడింది. అయ్యిందేదో అయింది.. 2023 ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే అడుగులు వేస్తోంది. ఆ ఎన్నికల్లో 79 సీట్లు తెచ్చుకోవాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మాణికం ఠాగూర్ లక్ష్యం నిర్దేశించారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి 2023 ఎన్నికలకు  సిద్ధమవ్వాలన్నది వారి ప్లాన్. అయితే.. నాయకుల కొరత, సన్నగిల్లుతున్న కేడర్ తో కాంగ్రెస్ ఏమేరకు లక్ష్యాన్ని చేరుకుంటుందో చూడాలి.

జీహెచ్ఎంసీతోనే సత్తా చాటాలని బీజేపీ..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని ఎప్పటినుంచో చెప్పుకుంటోంది బీజేపీ. అయితే.. అందుకు తగ్గ ఫలితాలను 2014, 2018 ఎన్నికల్లో చూపలేకపోయింది. అందుకే.. ఇప్పుడు జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటి ఆ మాట నిజం చేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. గ్రేటర్ లో 80 సీట్లు సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, కాంగ్రెస్, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో 80 సీట్లు గెలిచేంత ప్రజాదరణను బీజేపీ ఈ నాలుగేళ్ల కాలంలో సాధించిందా అనేది ఓ ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీల సత్తా ఏంటో.. టీఆర్ఎస్ ను ఏమేర దెబ్బ కొడతారో త్వరలోనే తేలనుంది.

 

 

 

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?