NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Congress Party: కాంగ్రెస్ పగ్గాలు ఆ మాజీ సీఎంకా..!? చిరంజీవికా..!? ఏపీపై పీకే ప్రత్యేక స్ట్రాటజీ..!

PK Strategy: KCR, Kodali in Part of PK Plan..?

Congress Party: దేశ వ్యాప్తంగా చతికలబడి లేచేందుకు ఊతకర్ర కోసం చూస్తున్న కాంగ్రెస్ కి నూతన జవసత్వాలు నింపేందుకు పాలిట్రిక్స్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. ప్రధానిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీని గెలిపించే పనిని తాను తీసుకుంటానని పీకే చెప్పారు. ఆ తర్వాత గత నెల రోజుల నుండి కాంగ్రెస్ తరపున సైలెంట్ గా.., అండర్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. కాంగ్రస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు పీకే సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన ఎన్నికల వ్యూహాకర్తగా మాత్రం పని మొదలెట్టేసారు.. ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయి చర్చించారు. అంతకు ముందు ప్రాంతీయ పార్టీల నేతలు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తదితరులతో చర్చించిన పీకే.. కేంద్రంలోని బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఆ పార్టీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గూటి కిందకు చేర్చే పనిలో నిమగ్నమైయ్యారు. ఇది ఇలా ఉండగా….

Congress Party: ఏపీపై ప్రత్యేక దృష్టి..!?

ఈ క్రమంలో భాగంగానే రాష్ట్రాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు గానూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీకే టీమ్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణలో పార్టీ మంచి ఊపు కనబడుతోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పీసీసీ అధ్యక్షుడి మార్పు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న శైలజానాధ్ కు మంచి పేరు ఉన్నప్పటికీ అంత దూకుడుగా లేకపోవడంతో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని పెద్దలు భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగా ఏపిలో దూకుడుగా వెళ్లే అందరికీ తెలిసిన నేతను పీసీసీ అధ్యక్షుడుగా నియమించాలన్నది కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం. ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎంత పుంజుకుంటే ఆ మేర వైసీపీ నష్టపోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదే వైసీపీ బ్రతికింది అన్నది అందరికీ తెలిసిందే. జగన్ ని దెబ్బకొట్టాలి అంటే ఏపీలో కాంగ్రెస్ బతకాలి. కాంగ్రెస్ బతికితే ఆటోమేటిక్ గా ఎన్నో కొన్ని సీట్లు రాకమానవు అనేది పీకే వ్యూహం..!

Congress Party: APCC Chief Special Focus by PK and Priyanka
Congress Party APCC Chief Special Focus by PK and Priyanka

వైసీపీ వీక్ పాయింట్లపై దృష్టి పెడతారా..!?

రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో సహా ఆ పార్టీ నేతలు వైసీపీకి షిష్ట్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే ఆ మేర వైసీపీ నష్టపోతుంది. ఇందుకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు పరిచయం ఉండి దూకుడుగా వ్యవహరించే నేతను ఏపి పీపీసీ అధ్యక్షుడుగా నియమిస్తే పార్టీ తెలంగాణలో మాదిరిగా జోష్ వస్తుందని పీకే వ్యూహంగా కనబడుతోంది. వైసీపీని దెబ్బకొట్టాలి, జగన్ ను దెబ్బకొట్టాలి. జగన్ ను అష్టదిగ్బంధం చేయాలి అన్నదే పీకే స్ట్రాటజీ. వైసీపీ బలహీనతలు, జగన్ బలహీనతలు పీకేకు బాగా తెలుసు. వాటిని ఆసరాగా చేసుకుని పీకే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ వైపుకు తిరిగి తీసుకువచ్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

Congress Party: APCC Chief Special Focus by PK and Priyanka
Congress Party APCC Chief Special Focus by PK and Priyanka

మాజీ సీఎం గా..? చిరంజీవికి ఇస్తారా..!?

ఈ క్రమంలో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతను యాక్టివ్ చేయడమో లేకపోతే వైఎస్ షర్మిలనే ఏపి రాజకీయాల్లోకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించడమో చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు చిరంజీవి కాంగ్రెస్ ని వీడలేదు కాబట్టి.. అతన్ని మళ్ళీ యాక్టీవ్ చేయాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. కొత్త నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించి రాష్ట్రంలో పాదయాత్ర చేయించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయన్న భావనలో కాంగ్రెస్ ఉంది. రాష్ట్ర విభజన పాపానికి తామే బాధ్యులమని, పదేళ్లు బీజేపీకి అవకాశం కల్పించినా విభజన హామీలను అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయిందని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం చేకూరుతుందని భావిస్తున్నది. ఏపిలో కాంగ్రెస్ పార్టీని లేపాలి అనేదే పీకే వ్యూహం. ఈ క్రమంలో భాగంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతను పీసీసీ అధ్యక్షుడుగా నియమించాలన్నది కాంగ్రెస్ పార్టీ టాస్క్. ఇందులో భాగంగా పీకే టీమ్ పాత కాంగ్రెస్ నేతలతో, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలతోనూ అంతర్గతంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా నార్త్ ఇండియా రాష్ట్రాలపై రాహుల్ గాంధీ, సౌత్ ఇండియా రాష్ట్రాలపై ప్రియాంక గాంధీ దృష్టి పెట్టారని తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాజకీయ వ్యూహాలతో ముందడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju