Upa vs Bjp: బీజీపీకి చెమటలు పట్టిస్తున్న రిపోర్ట్..! దేశం కాంగ్రెస్ గురించి ఆలోచిస్తోందా..?

BJP Narendra Modi: BJP Will blame PM in Failures
Share

Upa vs Bjp: యూపీఏ వర్సెస్ బీజేపీ Upa vs Bjp దేశాన్ని కొవిడ్ సెకండ్ వేవ్ అతలాకుతలం చేసేస్తోంది. కనిపించని శత్రువుపై.. కనిపిస్తున్న పాలకుల వైఫల్యమే ఈ ఉధృతికి కారణమనే విమర్శలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రధాని మోదీ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో వైఫల్యం చెందారని.. విదేశాలకు ఎగుమతులపై పెట్టిన శ్రద్ధ దేశీయంగా పెట్టలేదని కాంగ్రెస్ తోసహా విపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈతరుణంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ గతంలో విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతోంది. Factly.in వెబ్ సైట్‌లో ఉన్న ఆ వీడియోలోని సారాంశం బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపడమే కాదు.. మోదీ హయాంను కాంగ్రెస్ పాలనతో పోల్చే అవకాశాలూ లేకపోలేదు.

congress report giving shiver to bjp
congress report giving shiver to bjp

నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తే.. జీఎస్టీ 28 శాతం పన్ను విధింపు ఎన్నో రంగాలు దెబ్బ తినేలా చేసంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో ధరలు తగ్గించలేదు. రెండేళ్లుగా సరిహద్దులో చైనా చొరబాట్ల విషయంలో మోదీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. సరిహద్దు ఘర్షణలు, సైనికుల మృతి.. యుద్ధ వాతావరణాన్ని తలపించింది. కొవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ శ్రద్ధ పెట్టకపోవడంలో విఫలమయ్యారు. దేశంలో పీపీఈ కిట్‌ల స్టాక్ లేని పరిస్థితి తలెత్తింది.

యూపీఏ పదేళ్ల పాలనలో పేదల సంఖ్య 270 మిలియన్లైతే.. మోదీ ఏడేళ్ల హయాంలో 400 మిలియన్లు. యూపీఏ హయాంలో ఉన్న నిరుద్యోగం 2నుంచి 4.9శాతం, మోదీ హయాంలో 11శాతంకు చేరింది. యూపీఏ హయాంలో జీడీపీ సగటు 7.75-8.9 శాతం.. మోదీ హయాంలో మైనస్ -3.1 నుంచి మైనస్-7.3కి దిగజారింది. ఏడేళ్లలో బియ్యం 24శాతం, గోధుమల 33.76శాతం, పాల 29.38శాతం, దుంపలు 49శాతం మేర ధరలు పెరిగాయి. నిత్యావసరాల ధరలు 27శాతం నుంచి 67శాతంకు పెరిగాయి.

కాంగ్రెస్ పేర్కొన్న అంశాలపై Factly.in నివేదిక రూపొందించింది. జీడీపీ విషయంలో పాక్షిక వివరాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ  పేర్కొందని.. 2018-19లో జీడీపీ అంతకుముందు ఏడాది కంటే 8శాతం ఉందని తెలిపింది. దీనిపై ఖచ్చితత్వం లేదని తెలిపింది. నిరుద్యోగం విషయంలో కాంగ్రెస్ ఆరోపించిన 7.9 శాతం కాదని.. 6.1శాతమని పేర్కొంది. యూపీఏ హయాంలో 2.2శాతం ఉందని.. ఎగుమతులు, ఆటోమొబైల్ విక్రయాలపై కాంగ్రెస్ ఆరోపణల్ని ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పై అంశాలు మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేవే. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు వాస్తవానికి కాస్త దగ్గరగానే ఉండటం బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చెప్పాలి.

 

 


Share

Related posts

కోడిని క్ష‌మించిన డొనాల్డ్ ట్రంప్.. ‘షాక్’లో మీడియా!

Teja

Bank Job Notification : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోటిఫికేషన్..!!

bharani jella

క్రికెట్ ప్రియుల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్యాక్‌.. ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్..

Srikanth A