NewsOrbit
రాజ‌కీయాలు

సంక్షోభంలోనూ సచ్చురాజకీయాలే..! అందుకే ఆ పార్టీ ఇలా..!!

congress to give up clashes in these crisis

కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం అంటారు. నిజమే. కాంగ్రెస్ లో నాయకులే కాదు.. కార్యకర్తకు కూడా ఫ్రీడం ఉంటుంది. అది ఏస్థాయి అంటే.. ఎవరికి వారు నేనే లీడర్ అనేంతగా. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ దీనిని మాత్రం మార్చలేకపోయింది. ఎంతో ప్రాభవం ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంక్షోభంలో ఉంది. నాయకత్వ లేమి స్పష్టంగా ఉంది. ఇందులో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. అగ్ర నాయకులు పార్టీ వీడటం, ఎన్నికల్లో వరుస ఓటములు.. పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని దెబ్బ తీశాయి. అయినా.. కింద పడ్డా తనదే పైచేయి అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి. వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్వాల్సింది పోయి.. ఇంకా పదవుల కోసం పాకులాడటం విచిత్రంగా ఉంది.

congress to give up clashes in these crisis
congress to give up clashes in these crisis

ఓటమి నుంచి నేర్చుకునేదెప్పుడు..

దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటములు కాంగ్రెస్ పునరాలోచనలో పడేశాయి. దీంతో టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి కోసం పోటీ నెలకొంది. ఇందుకు ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వారి ఆధ్వర్యంలో పని చేసి పార్టీని పటిష్టం చేసి ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన వారికి ఉండటం లేదు. నేనే సీనియర్, నాకు క్యాడర్ ఎక్కువ.. పదవి నాకే దక్కాలి.. లేదంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధం అనేలా ఉన్నారు. పార్టీకి ఓట్లు రాని  ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రజల్లో నమ్మకం కలిగించాల్సంది పోయి ఇంకా పదవుల కోసం పోటీ పడటం తగని పనే. నాయకుల తీరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి.

సీనియర్లు పార్టీకి సహకరిస్తారా..

పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కడం ముఖ్యమే. ఇందుకు ఆశ పడటంలో కూడా తప్పు లేదు. కానీ.. రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పోటీలు పడటం పార్టీకి మంచిది కాదు. పైగా ఇన్నాళ్లూ వారికి రాష్ట్రంలో టీఆర్ఎస్ మాత్రమే శత్రువు. జాతీయస్థాయిలో బీజేపీతో వైరం ఉంది కానీ.. ఇన్నాళ్లూ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు బీజేపీ వరుస విజయాలతో పోటీకి వచ్చింది. టీఆర్ఎస్-బీజేపీ ఒకరికొకరు పోటీ పడితే.. కాంగ్రెస్ మాత్రం వీరద్దరితో ఎదురీది గెలవాల్సి ఉంది. మరి టీపీసీసీ రేసులో ఉన్న శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి.. వీరితోపాటు మేమున్నాం అంటున్న వీహెచ్, జీవన్ రెడ్డి వంటి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju