NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కల్నల్ పేరు మీద పేదలకి ఇళ్ళు కట్టండి… లేనోడికి ఉద్యోగం కల్పించండి… ఇదేంది ఇది !

మొత్తానికి భారత్చైనా మధ్య జరిగిన ఘర్షణలో గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణకు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు భార్య సంతోషికి కేసీఆర్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. వారికి ముందు హామీ ఇచ్చినట్లు వారి కుటుంబానికి బంజారా హిల్స్ రోడ్ నెం.14లో లో 711 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతో పాటు అతని భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయమై అందరిలో తీవ్ర స్థాయిలో చర్చ నెలకొంది.

 

ఇవే ప్రశ్నలు..!

కెసిఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో సంతోషి కి నియామక పత్రం అందించి హైదరాబాద్ పరిసరాల్లోనే ఆమెకు పోస్టింగు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు సరైన శిక్షణ ఇప్పించి ఉద్యోగంలో స్థిరపడే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితాసబర్వాల్ కు సూచించడం కూడా జరిగింది. అసలు సంతోషి ఏం చదువుకున్నారు మరియు ఒక డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించేందుకు ఆమెకు ఉన్న అర్హత ఏమిటి? కల్నల్ సంతోష్ బాబు మృతి నిజంగా వారి కుటుంబానికి తీరని లోటును మిగులుస్తుంది. అందుకొరకు ఆర్థికంగా వారికి ఎంత సహాయం చేసినా తక్కువే. అయితే ఇక్కడ కేసీఆర్ ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని అతని భార్యకు ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రకటించడం మరియు ఈ కరోనా ఉద్రిక్త సమయంలో ఆమెకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం…. ముఖ్యమంత్రి పై ఎన్నో విమర్శలకు దారి తీస్తోంది.

ఇలా చేస్తే చేటా..?

అంతెందుకు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆకస్మికంగా చనిపోయినప్పుడు వారి ఇంటిలో ఉన్న వారికి విద్యార్హతలను బట్టి వారి స్థాయికి, విద్యార్హత కు మరియు నైపుణ్యానికి తగ్గ గవర్నమెంట్ పోస్ట్ ఇస్తున్నట్లే సంతోషి విషయంలో వ్యవహరించాల్సింది అని కానీ ఆమెను ఒక డిప్యూటీ కలెక్టర్ గా తనకు ఉన్న పవర్ లో నియమించడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అంటున్నారు. అలాగే ఒక సెన్సిటివ్ మ్యాటర్ ను తన రాజకీయ మైలేజీ కోసం కేసీఆర్ వాడుకున్నారు అని కుడా విమర్శలు తలెత్తుతున్నాయి. కల్నల్ గారి పేరు పది తరాల పాటు గుర్తుండిపోయేలా పేదలకి ఇల్లు కట్టండి…. అలాగే లేనోడికి మరియు ఆర్మీ చేరాలనుకునే భావిభారత జవాన్లకు సదుపాయాలు కల్పించడం మరియు వారిని ప్రోత్సహించడం వంటివి చేస్తే సబబుగా ఉంటుంది కానీ ఇలా పెద్ద ఉద్యోగాలను ఇచ్చేస్తే ఇన్నేళ్ళు ఈ ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న వారు ఎవరో ఒకరు నష్టపోయినట్లు కాదా అని కొందరి వాదన.

పాయింటే…?

మానవతా దృక్పథం అన్న విషయం పక్కన పెడితే ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది అంటున్నారు. ఎంత చేసినా సంతోష్ బాబు కుటుంబానికి తక్కువే అని అంటారు కానీ కేవలం చనిపోయిన ఆర్మీ జవాన్ భార్య అయినంత మాత్రాన ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇవ్వడం ఏమిటి అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా నిజంగానే టిఆర్ఎస్ వ్యతిరేకదారులు కావచ్చు…. ప్రతిపక్షం రెచ్చగొట్టిన వారు కావచ్చు కానీ అది కూడా పాయింట్ కదా…. అని సామాన్య ప్రజలు నిదానంగా నోర్లు మెదుపుతున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk