ఢీల్లీలో సీపీఐ ధర్నా

ఢీల్లీ,జనవరి 2: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ ఆనటం భాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారన్నారు. రుణమాఫి చేయకుండా ఉండటానికే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు రుణమాఫి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన, రాష్ట్రం పట్ల కేంద్ర వైఖరికి నిరసనగా రేపు, ఎల్లుండి ఢీల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు 15 వందల కోట్లు రూపాయలే ఇచ్చిందని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం మీనమేసాలు లెక్కిస్తుందన్నారు. రెవెన్యూ లోటు 16 వేల కోట్లు ఉంటే కేవలం మూడున్నర వేల కోట్లే ఇచ్చారని పేర్కోన్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్‌ విషయంలోను అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు.