NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికల్లో ‘కారు’తో పోటీకి ‘సైకిల్ ” సైసై!

ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాగించటమే కష్టతరంగా ఉన్న టిడిపి తెలంగాణలో సాహసం చేయబోతోందట.త్వరలో జరగనున్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందని సమాచారం.

'Cycle' to compete with 'car' in Greater election
‘Cycle’ to compete with ‘car’ in Greater election

 

అసలు తెలంగాణా లో తెలుగుదేశమే లేదనుకున్న సమయంలో ఆ పార్టీ పోటీకి సిద్ధపడటం నిజంగా సంచలనమే.గత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ ఒక్క సీటుకే పరిమితమైంది. తర్వాత పరిణామాల మధ్య ఆయన కూడా టీఆర్‌‌ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి మహా కూటమి కట్టినా టిడిపికి కేవలం రెండు సీట్లు వచ్చాయి .లోక్సభ ఎన్నికల్లో టిడిపి అడ్రస్ లేకుండా పోయింది. టీఆర్ఎస్ ఇంకా అత్యంత బలంగా ఉందనే పరిశీలకులు భావిస్తున్నారు.అయితే కెసిఆర్ ప్రభుత్వంపై తెలియనంత ప్రజావ్యతిరేకత లోలోన ఉందని టిడిపి భావిస్తోంది .మరోవైపు టిఆర్ఎస్లో కూడా ప్రాధాన్యం దక్కని కొందరు నేతలు పక్కదారులు చూస్తున్నారని ,వారంతా టిడిపి కి క్యూ గట్టే అవకాశముందని పసుపు పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు.

మొత్తం మీద ఈసారి పరిస్థితి టిఆర్ఎస్ కి అంత ఏకపక్షంగా ఉండదని టీడీపీ భావిస్తోంది. అందుకే.. నూట యాభై డివిజన్ల గాను కనీసం అరవై నుండి డెబ్బై డివిజన్లలో పోటీకి టిడిపి సిద్ధపడుతోందని సమాచారం రంగంలోకి దిగాలని నిర్ణయించారు.అదే సమయంలో సొంతంగా పోటీ చేయాలని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. మొత్తం 150 డివిజన్లకు గాను కనీసం 60 నుండి 70 డివిజన్లలో పోటీచేయడానికి టిడిపి సిద్దపడుతోందని సమాచారం.హైదరాబాద్ సిటీ అభివృద్ధి టీడీపీతోనే జరిగిందని, ఆ అభిమానం ప్రజల్లో ఇప్పటికీ ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు సెటిలర్ల ఓటు బ్యాంకు కూడా టీడీపీకే ఉంటుంది.

ఎన్నికల్లో హైదరాబాద్‌లో తమ పార్టీకి ఏపాటి బలం ఉందో నిరూపించకుంటే భవిష్యత్‌ మరింత చీకటిమయం అవుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబుతో తరచూ హైదరాబాద్ సిటీ టిడిపి నేతలు సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.చంద్రబాబు కూడా హైదరాబాదు సిటీలో మళ్ళీ సైకిలుని పరిగెత్తించడానికి ఉత్సాహంగానే ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.ఇదే జరిగితే కారుతో సైకిల్ను ఢీ కొట్టడానికి కెసిఆర్ ప్రయత్నించకుండా వుంటుంటారా?చూడాలి ఏం జరుగుతుందో !!

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju