NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎవ్వరికీ దక్కని ఆఫర్ : ధర్మాన కి జగన్ మార్క్ బ్రాండ్ ఇమేజ్ !! 

రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ ని ఒక జిల్లాగా మార్చాలని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం లోనే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అయిన తరుణంలో ఈ నిర్ణయం ఆచరణలో పెట్టడానికి జగన్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 13 జిల్లాలుగా ఉన్న ఏపీ ముఖచిత్రం 25 జిల్లాలుగా మారబోతోందట. ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీల మీటింగ్ లో వైయస్ జగన్ సమావేశమైన సమయం లో కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అనధికారికంగా కొత్త జిల్లాల పేర్లు కూడా సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

Sadavatri Satram lands scam: Dharmana Prasada Rao takes on TDP govtఇటువంటి తరుణంలో తెలుగు రాజకీయాలలో ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జిల్లా శ్రీకాకుళంలో వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జిల్లా ని విభజిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఏకంగా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల మీడియా ముందు వ్యతిరేకించటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాని విభజిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతమంతా విజయనగరంలో కలిసిపోతుంది. అప్పుడు మేము ఇంకా వెనకబడిన ప్రాంతం లోనే ఉండటం జరుగుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే పోరాటాలు తప్పవు అన్నట్టు హెచ్చరించారు. ఏలాంటి హేతు పద్ధతి లేకుండా అసంభవ విభజన వల్ల పార్టీకి ఎంతో నష్టం ఉంటుందని, జిల్లాల మధ్య చిచ్చు పెట్టినట్లు అవుతుందని సూచించారు.

 

కాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో ధర్మాన ప్రసాదరావు ని కూల్ చేయడానికి వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి విభజన అంశాన్ని ఆయనకే అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ పార్టీ లో టాక్. అవసరమైతే ఉత్తరాంధ్ర విభజన కార్యక్రమానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగేలా అన్ని ప్రాంతాలకు తగిన న్యాయం చేసేలా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఆగకూడదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎవరికీ దక్కని ఆఫర్ ధర్మాన ప్రసాద్ రావు దక్కించుకున్నారు అనే టాక్ బలంగా వినబడుతోంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju