NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పవర్ ఏంటో జగన్ మోహన్ రెడ్డి కి అర్ధం అయ్యిందా ? 

రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ఒప్పందం ప్రకారం ప్రతి ఏప్రిల్ మాసంలో కౌలు డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలలు గడిచినా గాని రాజధాని రైతులకు కౌలు డబ్బులు ఇవ్వలేదు. జీవో పాస్ చేసిన గాని రాజధాని రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు. దీంతో రాజధాని ప్రాంత రైతులంతా కలిసి విజయవాడలో AMRDA కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Farmers stage protest against land acquisition in Andhra Pradesh - The  Economic Timesదెబ్బకి జగన్ ప్రభుత్వం భూ సమీకరణ లో భూములిచ్చిన రైతులకు ఇవ్వవలసిన కౌలు డబ్బులు వెంటనే చెల్లించడం జరిగింది. అంతేకాకుండా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటికే రాజధాని విషయంలో అమరావతి రైతులు కోర్టులకు వెళ్లి… చాలావరకు ప్రభుత్వంపై… పైచేయి సాధించే రీతిలో వ్యవహరిస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో తమకు రావలసిన డబ్బుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఎక్కడ తగ్గకుండా నిరసనకు దిగారు. కోర్టుకు వెళ్లకుండా ఈ రీతిగా చేయడంతో అమరావతి రైతుల పవర్ ఏంటో ముందే తెలిసి వచ్చిందో ఏమో తెలియదు గానీ ఆ నెక్స్ట్ డే నే జగన్ ప్రభుత్వం కౌలు డబ్బులు రిలీజ్ చేయడంతో పరిస్థితి చాలావరకు సద్దుమణిగింది. మూడు రాజధానులు నిర్ణయం తీసుకునే ఇప్పటికే అమరావతి రైతులకు జగన్ సర్కార్ ద్రోహం చేసినట్లయింది.

 

మరోపక్క రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను జగన్ సర్కార్ పేదలకు ఇవ్వడాని తప్పు పడుతూ ఇటీవలే రాజధాని రైతులు న్యాయస్థానానికి వెళ్లి అడ్డుకోవడం జరిగింది. అనేక రీతులుగా అమరావతి రైతులు వైసీపీ ప్రభుత్వం తో పోరాడుతూ వస్తున్న తరుణంలో…కౌలు విషయంలో కూడా పోరాడి తాము ఏంటో మరోసారి నిరూపించుకున్నారు అని రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వానికి అమరావతి రైతులు చాలా విషయాల్లో షాకుల మీద షాకులు ఇస్తున్నారు అని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.  

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju