NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం రాజ‌కీయాలు

ఆనం మాటల్లో ఏదో తేడా : నెల్లూరు రాజకీయాల్లో హీట్

 

 

**నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే… నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడు రెడ్ల హవా ఎక్కువ… ఆనం, మేకపాటి, కాకాని, ఆదాల, వేమిరెడ్డి, కోటంరెడ్డి, నేదురుమల్లి కుటుంబాలు… వారి పేర్లు ఇక్కడ ఎక్కువ అందరి నోళ్లలో నానుతూ ఉంటాయి… రెడ్ల కుటుంబాల్లో ఎక్కువగా ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్ఆర్సిపి లోనే ఉన్నారు. వీరిలో కొందరు జగన్కు అత్యంత ఆప్తులు అయితే మరికొందరు పార్టీలో ఉన్న వేరుగా ఉన్న వారు అంటే వేరు కుంపటి పెట్టుకొని తమ ప్రాధాన్యం కోసం పాకులాడే వారు… సొంత ఎజెండా లో సొంత ఇమేజ్ లు జగన్కు నచ్చవు… పార్టీలో అంతా తానే అవ్వాలి… తననే ఫాలో అవ్వాలి. జగన్ కూడా రెడ్ల సామాజిక వర్గం వ్యక్తి అయినా అందరినీ కలుపుకొని పోరు.. జగన్ తో కలవడం అంత సులభం కాదు.. ఎదుటి మనిషిలో ఏదో ఒక కోణాన్ని చూసి మాత్రమే జగన్ దగ్గరికి తీస్తారు… నేను, నా కుటుంబానికి పెద్ద పేరుంది. నాకు చాలా సీనియార్టీ ఉంది నేను చెప్పిందే వేదం నేను చేసింది చేస్తానంటే జగన్ దగ్గర కుదరదు… అందుకే ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి..


**ఎప్పటి నుంచో నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానిది పెద్ద పాత్ర. నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సత్తా వారికి ఉంది. ఆనం నలుగురు సోదరులు కూడా ఇటు రాజకీయాల్లో ఆర్థికంగా ను గట్టిగా పట్టు ఉన్న వారే. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆనం రామనారాయణరెడ్డి ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం సత్తా రెండూ కలిసి ఉన్నాయి… కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తర్వాత టీడీపీలో చేరిన ఆనం కుటుంబం..నిన్న మొన్నటి వరకు పసుపు చొక్కా వేసుకుంది.. 2019 ఎన్నికల్లో ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపిలో జగన్ సమక్షంలో చేరారు. సీనియర్ అయిన రాంనారాయణ రెడ్డి కి 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే విషయంలో ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఎదురయ్యాయి. నెల్లూరు నగరం లేదా రూరల్ సీట్లను మొదట కేటాయించాలని జగన్ను కోరిన ఆనం కుటుంబానికి జగన్ నుంచి అలాంటి హామీ ఏమీ రాలేదు. కనీసం సర్వేపల్లి లో అయినా టికెట్ ఇవ్వాలని కోరగా దానికి సైతం కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డుపడ్డారు. కాకాని కి సర్వేపల్లి టికెట్ ఇస్తామని జగన్ ముందుగానే చెప్పడంతో ఆయన అక్కడ ప్రచారం చేసుకున్నారు. చివరకు అన్ని చూసుకొని నెల్లూరు చివరలో ఉండే వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనంకు జగన్ కేటాయించారు. గతంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి ఏమాత్రం పరిచయం లేకపోయినా జగన్ గాలి తో పాటు ఆనందం సీనియార్టీ తో అక్కడకు నెగ్గుకొచ్చారు. అయితే జగన్ ప్రభుత్వంలో ఆనంకు ఏమాత్రం ప్రాధాన్యం దక్క లేదు సరికదా… సొంత పార్టీ నాయకులు జిల్లాకు చెందిన మంత్రులు నుంచి ఇప్పుడు ఆయన ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. ఎంతో జూనియర్ అయిన మంత్రి అనిల్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకుంటున్నారు.

సవాళ్లు ప్రతి సవాళ్లు

**నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు విచిత్రం చోటుచేసుకుంటుంది. అధికార పార్టీలో నాయకులే సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుక్కుంటున్నారు. జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ తనకు ఏమాత్రం సహకరించడం లేదని నెల్లూరు నగరం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి అనిల్ చేస్తున్న రాజకీయం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారు. ఆనం వర్గీయులపై కేసులు పెట్టడంతో పాటు… ఇటీవల ఆనం వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా కనీసం నగరంలో ఫ్లెక్సీలు కట్టడానికి కూడా కుటుంబానికి అనుమతి నిరాకరించడం పెద్ద విషయం అయ్యింది. మంత్రి అనిల్ కావాలనే నెల్లూరు నగరం పై తన మార్కు చూపించుకోవడానికి తహతహలాడుతున్నారని, కనీసం సీనియర్లు అయిన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆనం రాంనారాయణరెడ్డి కోపంతో ఉన్నారు.
** తాజాగా ఆనం వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం నుంచి ఇక నుంచి తాను రాజకీయాలు చేస్తామని… ఇతర నియోజకవర్గాల్లో ఉంటూ నెల్లూరు నగర ప్రజలకు ఆనం కుటుంబం దూరం అవ్వదు అని చెప్పడం కొత్త రాజకీయ ఘర్షణకు దారి తీసే సంకేతాలు ఇస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరం నుంచే రాజకీయాలు చేస్తే.. అది ఎవరిపై చేస్తారు ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏమిటీ అనీల్ దూకుడు??

**సెలవులు శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ కు జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది బయట వినికిడి. జగన్ ప్రోద్బలంతోనే అనిల్ దూకుడు పెంచారని ఆనం కుటుంబానికి కావాలనే చెక్ పెట్టాలనే కోణంలోనే జగన్ అనిల్ ను ప్రోత్సహిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. జగన్ వెనక లేకుండా అనిల్ ఎలా దూకుడుగా వెళ్లారని అందులోనూ నెల్లూరు జిల్లా లో కీలకంగా ఉన్న ఆనం కుటుంబ…

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!