న్యూస్ రాజ‌కీయాలు

పశ్చిమగోదావరి జిల్లాలో రైతులను టెన్షన్ పెట్టిస్తున్న వ్యాధి..!!

Share

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రశాంతతకు, పచ్చని పొలాలకు కేరాఫ్ అడ్రస్ గా పిలవబడే ఈ జిల్లాలో వింత వ్యాధి రావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గతంలో ఈ జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో వింత వ్యాధి వల్ల అనేక మంది బాధితులు పడిపోవటం అందరికీ తెలిసిందే. ఈ పరిణామంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవటమే కాక ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా హాస్పిటల్లో జాయిన్ అయినా బాధితులను పరామర్శించడం జరిగింది.

తర్వాత వింత వ్యాధి కనుమరుగు అవ్వక తాజాగా మళ్లీ ఇదే జిల్లాలో భీమడోలు లో బయటపడటంతో.. పశ్చిమ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జిల్లా వైద్య యంత్రాంగం లో కూడా టెన్షన్ నెలకొంది. ఎక్కువగా బాధితులలో రైతులు ఉండటంతో.. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

 

అసలు ఈ వ్యాధి మూల కారణం ఏంటి అన్న దాని విషయం తెలుసుకోవడానికి జిల్లాలో  నీటిని పరీక్షించడానికి ల్యాబ్‌కు పంపించారు. గురువారం శాంపిల్స్‌ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మెడికల్‌ క్యాంపు, మందులు అందుబాటులో తీసుకు రావడం జరిగింది. ఈ పరిణామంతో జిల్లా చుట్టుప్రక్కల సరిహద్దు గ్రామాల లో టెన్షన్ వాతావరణం నెలకొంది.


Share

Related posts

Raddish: ఒక గ్లాసు ముల్లంగి రసం తాగితే ఈ రోగాలు పరార్..!!

bharani jella

ఏకంగా ఐపీఎల్ కే తాకిన వంటలక్క సెగ..! మెసేజ్ లతో గంగూలీ చచ్చిపోతున్నాడు

arun kanna

బిగ్ బాస్ 4: అరియనా కోసం కష్టపడుతున్న ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar