NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ బ్రెయిన్ లో ఇంత ప్లాన్ ఉందా ?

మంత్రి పోస్టు కంటే ఎంపీ పదవి పెద్దదేం కాదు.మంత్రులుగా ఉన్న ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపి వారికేదో మేలు చేశారని వైసీపీ వర్గాలు భావిస్తుంటే ఇందుకు భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 

 

నిజానికి వారిద్దరూ బలిపశువులయ్యారు అంటున్నారు.వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రి జగన్ ఆ ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకి పంపి తన మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఆ ఇద్దరూ ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. నిజానికి వీరు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. కానీ జగన్ చేరదీసి పెద్దల సభ ద్వారా మంత్రులను చేశారు.ఇంతవరకూ బాగానే ఉంది .అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలి తిప్పి కొట్టడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దాంతో ఆయన మూడవ కన్ను తెరచి మండలి రద్దు అనేశారు.ఆ ప్రక్రియను కూడా ప్రారంభించేశారు అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు.తుది నిర్ణయం కోసం కేంద్రానికి ఆ తీర్మానం పంపారు



కానీ మండలి మాయం కాలేదు, దాని ఆయువు అలాగే ఉంది.కేంద్రం చేతిలోనే కధ అంతా ఉంది. మరి కేంద్రం మండలి రద్దు అనడంలేదు.మండలి రద్దు జరగలేదు కానీ మంత్రుల పోస్టులు మాత్రం ఊడిపోయాయి. పిల్లి, మోపిదేవి గట్టిగా సీట్లో కూర్చుని ఏడాది అయినా కాకముందే వారిని ఢిల్లీ బాట పట్టించారు జగన్. బీసీనేతలు అంటూ రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించినా మంత్రుల కంటే అది ఎక్కువ కాదన్న మాట ఇపుడు వారు అనుచరుల్లో వినిపిస్తోంది

ఇక మండలి రద్దు అన్న తరువాత పెద్ద తతంగమే ఉందని జగన్ కి తెలుసు. కానీ ఆదరాబాదరాగా ఇద్దరు మంత్రులను పెద్ద సభకు ఢిల్లీకి పంపించేయాలని జగన్ చూడడం వెనక వారి మీద ప్రేమతో పాటు మరో రకమైన రాజకీయం ఉందని ఇపుడు వినిపిస్తున్న మాట. వైసీపీలో మంత్రి పదవులు లేక జనం అల్లాడుతున్నారు. పైగా జగన్ రెండున్నరేళ్ళు కాలపరిమితి పెట్టారు. అసలే ఆశావహులు ఎక్కువ. ఇలా మూతి బిగించేయడంతో ఎక్కడికక్కడ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక జగన్ సీఎం కావాలని సొంత సామాజికవర్గం రెడ్లు ఎంతో త్యాగం చేసారు. సామాజిక సమీకరణల పేరిట వారికి చెక్ పెట్టేశారు. దాంతో బయట పడని అసంతృప్తి చాలానే ఉందని గ్రహించే జగన్ ఈ ఇద్దరు మంత్రుల ఖాళీలను క్రియేట్ చేశారని అంటున్నారు.

ఇక తాను అన్న మాట తప్పకుండా ఇద్దరు మంత్రుల రాజీనామాలను చూపిస్తూ మొత్తం విస్తరణకే జగన్ పూనుకుంటున్నారని అంటున్నారు. అలా చేయడం వల్ల మరికొంతమందికి మంత్రి పదవులు అవకాశంగా వస్తుందని అంటున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మధ్యలో మంత్రివర్గ విస్తరణ చేయటానికి ఒక కారణం కావాలి కాబట్టి ఈ ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపి తద్వారా ఖాళీలను సిద్ధం చేసుకుని కేబినెట్ విస్తరణకు ప్లాన్ చేసుకున్నారట.ఈ లెక్కన చూస్తే పిల్లి,మోపి దేవిలకు వచ్చింది ప్రమోషన్లు కాదని మంత్రులుగా ఊస్టింగ్ లని వైసీపీలోనే కొత్త కథలు వినిపిస్తున్నాయి.లోగుట్టు జగన్ కే ఎరుక !

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju