NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి రెడ్డి ఫీలింగ్ ఉందా..? లేదా..? తేల్చేసే సంఘటన ఇది..!

 

జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందని, ఆ సామాజిక వర్గానికి ఆయనే బ్రాడ్ అంబాజిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కులస్తులకే ఎక్కువగా పదవులు, హోదాలు కట్టబెట్టారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిలో కొన్ని వాస్తవాలు లేకపోలేదు.

In administration why jagan is not gaining popularity?
Jagan

 

జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల్లో, ఆయన పార్టీ కార్యవర్గం లోనూ, జిల్లాల ఇంచార్జి ల విషయంలోనూ, కొన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. అయితే తన సొంత సామాజిక వర్గం తప్పు చేస్తే జగన్ ఊరుకుంటారా లేదా అనేదే ఇక్కడ పెద్ద సమస్య. కులాభిమానంతో పదవులు కట్టబెట్టినంత వరకు ఓకే. జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ తన సొంత కులస్తులు తప్పులు చేస్తే ఆ తప్పులను కూడా మన్నించేంత గుణం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా చూస్తూ సర్దుకుపోయే తత్వం జగన్మోహన్ రెడ్డి రెడ్డి లో ఉందా లేదా అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. దానికి ఈ ఉదాహరణే సాక్షంగా నిలుస్తుంది. సమాధానంగా నిలుస్తోంది. అదేంటో చుద్దాం..

విజయవాడలో సిఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన ఒ పోలీస్ అధికారి తప్పు చేశాడు. ఉన్నతాధికారుల ప్రాధమిక విచారణలో ఆ అధికారి తప్పు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని చూపుతూ అధికార పక్ష వైసీపీ నేతలు… జగన్ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, కులం, మతం చూడరు. వేటు వేయడం ఖాయమని చెప్తూ ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.

విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ నాగరాజ రెడ్డి ఒ బిల్డర్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. పడమట లోని ఒక భవన నిర్మాణం జరుగుతుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. దానిపై గొడవ జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఈ వ్యవహారంలో బిల్డర్ సుధాకర శర్మ నుండి ఏసీపీ నాగరాజ రెడ్డి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిల్డర్ సుధాకర శర్మ స్వయంగా ఉన్నతాధికారులకు ఏసీపీ నాగరాజ రెడ్డిపై పిర్యాదు చేశారు. తనను డబ్బులు డిమాండ్ చేశారని పిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంపై డీజేపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ గా తీసుకున్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీనితో ఏసీపీ నాగరాజ రెడ్డి ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ డీజేపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju