ఇది మేనేజ్మెంట్ కాదంటారా..? జాతీయ మీడియా పోల్ లో నిజమెంత..!?

రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే ఓ జాతీయ మీడియా పోల్ నిర్వహించింది. మూడు రాజధానులు ఉండాలా వద్దా.. సీఎం జగన్ నిర్ణయం సరైనదేనా..? అంటూ ఆ పోల్ సాగింది. మొత్తంగా 4,31,980 ఓట్లు పోలయ్యాయి. ఈ పోల్ లో దాదాపు 81 శాతం మంది ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 18 శాతం మాత్రమే జగన్ నిర్ణయాన్ని స్వాగతించినట్టు ఓట్లు పోల్ అయ్యాయి. నిజానికి.. మూడు రాజధానుల నిర్ణయంపై అంత వ్యతిరేకత ఉందా..? ఈ పోల్ లో వాస్తవమెంత..? అనే విషయాల్ని కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే.

doubts raising on national media poll about three capitals
doubts raising on national media poll about three capitals

అమరావతి మేనేజింగ్ కెపాసిటీ తెలియనిదా..!

ఆమధ్య మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఓ బెంచ్ కు వెళ్లింది. అయితే.. ఆ న్యాయమూర్తి ఈ కేసును వాదించేది తన కుమార్తె కావడంతో ఆయన ఈ కేసును సమీక్షించలేనంటూ మరో బెంచ్ కు బదిలీ చేశారు. అక్కడ నుంచి కూడా కొన్ని కారణాలతో మరో బెంచ్ కు వెళ్లింది. దీంతో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఈ ప్రాంతవాసులు సిద్ధహస్తులనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. అమరావతి ప్రాంత రైతులు, వారి ముసుగులో ఉన్న నాయకులు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసే విషయంలో కానీ.. తమ ప్రభావం చూపడంలో కానీ ఆరితేరి ఉన్నారు. అయితే.. దీనిపై పూర్తిగా ఓ నిర్ణయానికి వచ్చే పరిస్థితులు లేవు.

జగన్ కు ఈ విషయాలన్నీ తెలుసా..?

మూడు రాజధానుల అంశంపై ఎంత అనుకూలత ఉందో.. అంతే వ్యతిరేకత ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనుకూలంగా ఉంటే.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత వస్తోంది. కర్నూలులో న్యాయ రాజధాని ప్రకటనతో రాయలసీమ జిల్లాల్లో పెద్దగా ఈ విషయంపై స్పందన లేదనే చెప్పాలి. దీంతో రాజధాని అంశంపై 50-50 అభిప్రాయం నెలకొందని చెప్పాలి. ఈ విషయం సీఎం జగన్ కు తెలియంది కాదు. కానీ.. ఓ నేషనల్ మీడియా మాత్రం ఏకంగా 81 శాతం జగన్ కు వ్యతిరేకంగా పోల్ ఇవ్వడం వీరందరి మేనేజ్ మెంట్ లెవల్స్ కు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి. దీనినే ఏపీలో టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటోంది.