రాష్ట్రాలకు కరువు సాయం నిధులు మంజూరు

అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కరువు సహాయ నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7214.03కోట్ల రూపాయలను కరువు సాయంగా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 900.40కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 4714.28కోట్ల రూపాయలు, కర్నాటకకు 949.49కోట్ల రూపాయలు, గుజరాత్‌కు 127.60కోట్ల రూపాయలు 191.73కోట్ల రూపాయలు, హిమాచల్‌ప్రదేశ్‌కు 317.44కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు 191.73కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 13.09కోట్ల రూపాయలు కేటాయిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయిల్, రాధామోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.