దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ నేతలకు చావోరేవో..??

దుబ్బాక ఉప ఎన్నికలు మరియు వర్షాలు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నాయకులు తెగ కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ నేతలకు చావో రేవో అన్నట్లుగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే కొత్త ఇన్చార్జి దగ్గర మార్కులు కొట్టేయడానికి టీ.కాంగ్రెస్ నేతలు తెగ అత్యుత్సాహం చూపిస్తున్నారట. ఇప్పటికే జరిగిన రెండు ఉప ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందడంతో.. జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందుకే తెలంగాణ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్య టాగూర్ సరికొత్త ప్లాన్ వేశారట.

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే - MicTv.in - Telugu  Newsక్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు దుబ్బాకలో ఒక్కో మండలం అప్పగించారట. దీంతో తమకు అప్పగించిన మండలాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తప్పించడానికి టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు తెగ తాపత్రయ పడుతున్నారట. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు అప్పజెప్పిన మండలంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు క్షణం క్షణం చూసుకుంటూ వ్యవహరిస్తున్నారని టాక్.

 

అదేవిధంగా పిసిసి అధ్యక్ష పీఠంపై కన్నేసిన రేవంత్ రెడ్డి…ఇన్చార్జి ఠాగూర్ వద్ద మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు అని పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. ఈ ఉప ఎన్నికల్లో మిరుదొడ్డి లో బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి.. ఒక ప్రత్యేకమైన టీం మండలంలో దిన్చేశారట. అధికార పార్టీ టీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా ప్లాన్ వేశారట. అదే టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తున్నారట రేవంత్. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ కూడా ఇదే పనిలో పడ్డారట. ఏదో రకంగా ఇన్చార్జి దగ్గర మార్కులు కొట్టేయాలని దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతలను చేపట్టిన సీనియర్లు రకరకాల ఫీట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.