దుబ్బాక బై పోల్..8వ రౌండ్‌లో బీజేపీ ఆధిక్యత

Share

 

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠను కల్గిస్తోంది. ఇప్పటి వరకూ ఏనిమిది రౌండ్ లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయిదు రౌండ్ల వరకూ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు అధిక్యతలో కొనసాగారు. ఆరు, ఏడవ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి  సుజాత స్వల్ప అధికత్య సాధించారు. 8వ రౌండ్‌లో  మళ్లీ బీజెపి అభ్యర్థి 621 ఓట్ల ఆధిక్యత సాధించారు.

రౌండ్ రౌండ్ కు స్వల్ప మెజారిటీలే కొనసాగుతూ వస్తుందటంతో మిగిలిన రౌండ్‌లపై ఉత్కంఠత కొనసాగుతోంది. 8 రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు 3,106 ఓట్ల ఆధికత్యతో ఉన్నారు. ఆరవ రౌండ్ లో 353 ఓట్లు,  ఏడవ రౌండ్ లో 182 ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత సాధించారు. గెలుపుపై బీజెపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.


Share

Related posts

Daily Horoscope జూలై 7 మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

అచ్చెన్నతో సహా టీడీపీ నేతల గృహనిర్బంధం..పలాసలో హైటెన్షన్

somaraju sharma

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అదుర్స్

Varun G