NewsOrbit
రాజ‌కీయాలు

కేసీఆర్ సరదాగా అంటే.. దుబ్బాక ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు..!

dubbaka voters serious action on kcr words

బీజేపీపై దేశంలో వ్యతిరేకత మొదలైందని వాదన మొదలుపెట్టిన ఎన్నో రాజకీయ పార్టీలకు, నాయకులకు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బైర్లు కమ్మేలా చేశాయి. బీజేపీ ప్రభావం ఉన్న బీహార్ రాష్ట్రంలో ఆ పార్టీ పుంజుకోవడం ఒక ఎత్తైతే.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయదుందుభి మోగించడం బీజేపీకి అసలైన విజయంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీని ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్యను దుబ్బాక ప్రజలు సీరియస్ గా తీసుకున్నారో ఏమో.. 60వేల మెజారిటీతో గెలిపించిన స్థానాన్ని రేండేళ్లకే లాగేసుకున్నారు. కేసీఆర్ అన్న మాటలేంటి.. వాటి పర్యవవసనాలను పరిశీలిస్తే..

dubbaka voters serious action on kcr words
dubbaka voters serious action on kcr words

బీజేపీపై వ్యతిరేకత లేదనే అర్ధమా..?

బీజేపీ ఒంటెద్దుపోకడలు, మోదీ-షా నిరంకుశత్వం, వ్యవసాయ బిల్లుపై వ్యతిరేకత.. ఇవన్నీ బీజేపీని సాకుగా చూపాయి రాజకీయ పార్టీలు. కానీ.. దుబ్బాకలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఈ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రణాళికలు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును కేసీఆర్ వ్యతిరేకించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏపీ సీఎంపై మంత్రి హరీశ్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో లక్ష మెజారిటీ బాధ్యత నాది అన్నారు. ఈ పరిస్థితులన్నిటికీ దుబ్బాక ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పారు. వ్యవసాయ బిల్లు, మోదీ-షా నిరంకుశత్వం, బీజేపీ ఆధిపత్యం వారికి కనపడలేదు. రాష్ట్ర నాయకత్వంపై తామెంత విసుగు చెందారో అదొక్కటే మనసులో పెట్టుకున్నట్టున్నారు.

ప్రజలతో పెట్టుకుంటే అంతేనా..

గత ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు, సచివాలయం కూల్చివేత, కరోనా కట్టడిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఇవన్నీ టీఆర్ఎస్ వైపు వీచిన వ్యతిరేక పవనాలే. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణలో పెరుగుతున్న వ్యతిరేకతకు దుబ్బాక ప్రజలు తమ ‘ఓటు’తో చూపించినట్టైంది. ఇక కేసీఆర్ మాటలను దుబ్బాక ప్రజలు తీసుకున్న తీరును ప్రస్తావిస్తే.. ‘బీజేపీ మాటలకు.. వారికొచ్చిన ఓట్లకు పొంతన ఉందా’ అని 2018 ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘జల్సా’ సినిమాలోని ఓ సన్నివేశంలో.. నేనేదో సరదాగా అన్నాన్రా అని పవన్ కల్యాణ్ తో ప్రకాశ్ రాజ్ అంటే.. ‘నేను సీరియస్ గా తీసుకున్నాను.’. అని పవన్ రిప్లై ఇస్తాడు. దుబ్బాకలో ప్రకాశ్ రాజ్ ఎవరో.. పవన్ కల్యాణ్ ఎవరో ఇక్కడ చెప్పక్కరలేదనుకుంటా..!

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!