NewsOrbit
రాజ‌కీయాలు

చెత్తపనితో దొరికిన అధికారి..! ప్రభుత్వానికె కదా మచ్చ..!!

dump at banks blames ap government

ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, మచ్చ తీసుకురవాలని చూడాలన్నా.. ప్రతిపక్ష పార్టీలు అవకాశాలను ఉపయోగించుకుంటాయి. దీంతో ప్రభుత్వం స్పందించడం జరుగుతుంది. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతలే కొందరు ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారు. ఈ ముసుగులో మరికొందరు చెలరేగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా సొంత పార్టీకి తామే నిప్పు పెట్టుకుంటున్నారు. అంతిమంగా చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి, సీఎం జగన్ కు అనేది మర్చిపోతున్నారు. రుణాలు ఇవ్వట్లేదు అని కొన్ని జాతీయ బ్యాంకుల ముందు చెత్త వేసి నిరసన తెలియజేసిన ఘటన జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఏకంగా కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ అని చెప్పాలి.

dump at banks blames ap government
dump at banks blames ap government

బుగ్గన కు నిర్మలా సీతారామన్ ఫోన్..

జగనన్నతోడు, వైఎస్ఆర్ చేయూత.. తదితర పథకాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో జాప్యం చేయడం, వెనుకంజలో ఉన్న మాట వాస్తవమే. ఇందుకు ఉయ్యూరులోని ఆంధ్రా బ్యాంక్, ఎస్ బీఐ, సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. తదితర బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. అయితే.. ఇందుకు నిరనన వ్యక్తం చేస్తూ పలువురు ఆయా బ్యాంకుల ముందు ఏకంగా చెత్త వేసి నిరసన తెలియజేశారు. పైగా మున్సిపల్ కమిషనర్ పోయమన్నారంటూ బోర్డులు పెట్టారు. ఈ విషయం రాష్ట్రం దాటి ఏకంగా కేంద్రా ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ కు చేరిపోయింది. వెంటనే రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కు ఫోన్ చేసారు. ఇటువంటి సంఘటనలు మంచివి కావని.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైసీపీ మేల్కోకుంటే భారీ మూల్యమే..!

కేంద్ర మంత్రి ఈ విషయంపై సోషల్ మీడియాలో రెస్పాండ్ కావడంతో ఈ వింత పోకడ గురించి జాతీయస్థాయిలో చర్చ జరిగింది. అంతిమంగా పోయింది రాష్ట్ర ప్రభుత్వం పరువు. ఇది సీఎం జగన్ కు కూడా తగిలేదే. దీనిపై సీరియస్ అయిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ను వివరణ కోరారు. లబ్దిదారులు సహనం కోల్పోయి చేసిన పనికి తన పేరు మీద బోర్డులు పెట్టి తనను మధ్యలోకి లాగారని కమీషనర్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు వ్యవహరించిన తీరుకు ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ విషయాన్ని లబ్దిదారులు, ఆ ముసుగులో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు గుర్తెరిగితే మంచిదే..!

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?