East Godavari YSRCP: తూర్పున తలో దిక్కు..! జగన్ కి పేద్ద చిక్కు..!!

East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP
Share

East Godavari YSRCP:  రాష్ట్రానికి రాజకీయ గుండెకాయ తూర్పుగోదావరి జిల్లా.. 19 శాసనసభ స్థానాలు.. కాపు ఎక్కువగా ఉన్నప్పటికీ, కమ్మ, రెడ్డి, బీసీ, ఎస్సి ఓటింగ్ కూడా సమపాళ్లలో ఉన్న జిల్లా తూ.గో..! అందుకే ఈ జిల్లా ఏపీలో ప్రాధాన్యమున్న ప్రాంతం.. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటే..గడచిన 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 స్థానాలు వైసీపీ కైవశం చేసుకోగా.., కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుచుకుంది.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుండి ఆ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువయ్యింది. స్వపక్షంలోని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు మధ్య, ఎమ్మెల్యేలకు, ఎంపీకి మధ్య పడటం లేదు. రాజమండ్రి ఎంపిగా వైసీపీ నుండి మార్గాని భరత్ ఉండగా, రాజమండ్రి అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లా వైసీపీలో ఒక ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధి మరో నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తెరలేపడం ఇక్కడ సమస్య వచ్చి పడింది.

జిల్లాలో ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. ఎంపీలకు మధ్య పడడం లేదు. గడిచిన రెండేళ్లలో అందరూ కలిసి చర్చించిన సమస్యలూ లేవు, అందరూ కలిసి అడుగేసిన సందర్భమూ లేదు. పైగా సాకులు చూసుకుని ఒకరిపై ఒకరు పెద్ద పెద్ద ఫిర్యాదులతో పార్టీ పెద్దలను సతమతం చేస్తున్నారు. త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు ఉండగా… ఎంపీ భరత్, పక్కనే రాజానగరం ఎమ్మెల్యే రాజాకు ఏమాత్రం పడడం లేదు. మీడియా ఎదుట పేర్లు చెప్పుకుని, నేరుగా హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. ఎవరికీ వారు నా ఇష్టం అంటూ చెప్పుకుంటున్నారు. ఇటీవల ఎంపీ భరత్ రామ్ “నా పాదయాత్ర నా ఇష్టం. వాళ్ళు ఎందుకు ఉలికి పాటు అంటూ ఎమ్మెల్యే రాజాని ఉద్దేశించి వ్యాఖ్యానించగా.., “ఎన్నికలకు రెండు రోజుల ముందు పార్టీలోకి వచ్చి పార్టీ మాది అంటే.. దశాబ్దాల నుండి రాజకీయం చేస్తున్న వాళ్ళు ఏమవ్వాలి” అంటూ జక్కంపూడి ఘాటుగానే మాట్లాడారు. ఈ ఇద్దరికీ మధ్య చిచ్చు ఇప్పటిది కాదు. పైగా జిల్లాలో ఈ ఇద్దరి మధ్యనే చిచ్చు కాదు…!

East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP
East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP

East Godavari YSRCP: లోకల్ ఎమ్మెల్యేకు “ఆవ”గింజంత కూడా లేదట..!!

ఉదాహారణకు తీసుకుంటే..తూర్పు గోదావరి జిల్లాలో ఓ పెద్ద కుంభకోణం అంటే అది ఆవ భూముల వ్యవహారం. పేద వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆవ భూములను సేకరించింది. నిజానికి అక్కడి భూముల ధరలు రూ.5 లక్షలు మాత్రమే ఉంటే అధికార పార్టీ నేతలు రూ.40 – 50 లక్షల వరకూ ప్రభుత్వంతో కొనుగోలు చేయించి.., ఎకరానికి 40 నుండి 45 లక్షలకుపైగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టులోనూ కేసు నడుస్తోంది. వాస్తవానికి ఇక్కడి భూముల కుంభకోణంలో స్థానిక ఎమ్మెల్యేకి ఏమాత్రం తెలియదట. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేదేమో రాజమండ్రి వాసులకు.., లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలం మాత్రం రాజానగరం నియోజకవర్గ పరిధిలోనిది. దీంతో లోకల్ ఎమ్మెల్యేకి ఈ విషయంలో సంబంధం లేకుండానే.. మరో ఇద్దరి ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపణలున్నాయి.. అంతర్గత చర్చలూ ఉన్నాయి., దీంతో స్థానిక ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఇంత పెద్ద అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఏడాదిన్నర క్రితమే పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.

East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP
East Godavari YSRCP:  Big Scams in Big District being Big Issues in YSRCP (Aava Lands Pic)

* అది అలా ఉంచితే.. ఒక నియోజకవర్గంలో గ్రావెల్ కొండ ఉంది. నిజంగా అక్కడ క్వారీయింగ్ ప్రారంభిస్తే ఓ పెద్ద ఆర్థిక వనరు అవుతుంది. రోజుకు పది లక్షలు అవలీలగా సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఇదే జిల్లాలో మరో ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే జిల్లా నేతలు, ఇన్ చార్జిల పేరు చెప్పుకొని పర్మిషన్లు తెచ్చుకుని కొండను తవ్వేసుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తనకు తెలియకుండా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే ఆ ఎమ్మెల్యే ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఇలా జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు బాధితులుగా ఉన్నారు. వారి ప్రాంతాల్లోని ఆర్థిక వనరులను ఇతర ప్రాంతాలకు చెందిన దోచుకుంటున్నారు. పార్టీలో, పెద్దల వద్ద పలుకుబడి ఉండటం వల్ల చేసుకుంటే చేసుకున్నారులే కానీ కమీషన్ రూపంలోనైనా ఏమైనా ఇస్తారు అనుకుంటే అది కూడా ఇవ్వకపోవడంతో ఆ నలుగురు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు.

East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP
East Godavari YSRCP: Big Scams in Big District being Big Issues in YSRCP

నిత్యం పెద్దల వద్దకు రాయబారాలు..!!

జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతి, అక్రమాలు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి, ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు నిత్యం ఈ బాధిత ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. కొందరు ఈ జిల్లాలోని విషయాలను పార్టీ పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామ కృష్ణారెడ్డి వద్ద చెప్పుకుంటుండగా మరో కొందరు నేరుగా సీఎం జగన్ ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అక్రమ దందా పార్టీలోని పెద్దలకు తెలిసి జరుగుతుందా లేక తెలియకుండా వారి పేరు చెప్పి చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక వేళ పై స్థాయిలో తెలియకుండా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు, జూనియర్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ అన్నట్లుగా అంతర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసిన ఓడిపోయిన నియోజకవర్గం రామచంద్రాపురం. అదే నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులుకు, పిల్లి సుభాష్ చంద్రబోసుకు మధ్య దశాబ్దాల తరబడి వైరం ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆయనను రాజ్యసభకు పంపడం, కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రత్యర్ధి అయిన తోట త్రిమూర్తులుకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ఉన్నసమయంలోనే తోట త్రిమూర్తులు మీద గతంలో ఉన్న పాత కేసులను వెలికితీసి వాటిపై విచారణ చేయాలని హోంమంత్రికి లేఖ కూడా రాశారు. ఇలా అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలతో రగిలిపోతుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో లేక పార్టీ పెద్దలు వారిలో ఉన్న విబేధాలను చక్కదిద్దుతారో వేచి చూడాలి. తాజాగా ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. ఏ క్షణమైనా.., ఏ రోజైనా తాడేపల్లి వేదికగా ఈ జిల్లా ఎమ్మెల్యేలు ఒకరి చరిత్ర ఒకరు విప్పుకుని అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది..!


Share

Related posts

చిరు పొలిటికల్ పయనం..! మూడు కూడళ్లలో ఎటువైపు..??

Muraliak

ఎన్నికల్లో డబ్బు పంపిణి తీవ్ర నేరం

somaraju sharma

Tdp-Janasena: టీడీపీ-జనసేన ట్విట్టర్ వార్..! హ్యాష్ ట్యాగ్ లతో హల్ చల్..!!

Muraliak