Eenadu Ramojirao: “ఈనాడు” రామోజీరావు కుట్రలు బయట పెడుతున్న దగ్గుబాటి..! రాజకీయాల్లో కొత్త సంచలనం..!!

Eenadu Ramojirao: Daggubati Sensational Post
Share

Eenadu Ramojirao: “ఈనాడు” అంటే ఒక పవిత్ర గ్రంధం.. అది ఏం రాస్తే అదే వేదం.. అందులో ఏమొస్తే అదే నిజం.. ఆ పత్రిక ఎవర్ని టార్గెట్ చేస్తే వారికి మూడినట్టే.. ఆ పత్రిక ఎవర్ని ఎక్కించాలనుకుంటే వారికి అవకాశాలు మెరుగైనట్టే.. ప్రజల మెదళ్లలో బీజాలు నాటే అక్షరాలతో “ఈనాడు” తెలుగు నాట రాజకీయాలను బాగానే శాసించింది. అయితే గడిచిన పదేళ్లగా ఈనాడు నాటకాలు సాగడం లేదు. అసలు రంగు తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం ఎందుకంటే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందరికీ గుర్తుండే ఉంటారు. ఎన్టీఆర్ గారి పెద్ద అల్లుడు.., పురంధేశ్వరి భర్త… ఆయన నిన్న పెట్టిన ఓ ఫేస్ బుక్ పోస్ట్ తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకి దారితీస్తుంది. ఎన్టీఆర్ కి మొదటి వెన్నుపోటు చంద్రబాబు కాదని.. ఈనాడు రామోజీరావు ద్వారానే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా 1989 నుండీ వెన్నుపోటు రాజకీయాలు మొదలయ్యాయని..ఆ పోస్టులో రాశారు. పైగా “రామోజీరావు గారు బతికే ఉన్నారు. నేను రాసింది తప్పు అయితే ముందుకు వచ్చి, చెప్పొచ్చు” అంటూ సవాల్ కూడా చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ వెన్నుపోటులా లిస్టులో ఈనాడు రామోజీ పాత్రని దగ్గుబాటి స్పష్టంగా చెప్పేసారు..

Must Read: ఎన్టీఆర్ ఎందులో గొప్ప..? కొంచెం ఆలోచిద్దామా…!?

Eenadu Ramojirao: Daggubati Sensational Post
Eenadu Ramojirao: Daggubati Sensational Post

Eenadu Ramojirao: ఆ పోస్టులో ఏముందంటే..!? సంక్షిప్తంగా..!

1985 – 1989 మధ్య పరిపాలనలో కొన్ని తప్పులు జరిగాయి. ఎన్టీఆర్ కి తెలియకుండా చాలానే జరిగాయి. అందుకే 1989లో ఒకేసారి 30 మంది మంత్రులను భర్తరఫ్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు రామోజీరావుకు నచ్చలేదు. “ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి ఈనాడు ద్వారా తాను తోడుంటే తనను పట్టించుకోకుండా, తనను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని రామోజీరావు ఆలోచించి.. చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అనేక వార్తలు రాసారని దగ్గుబాటి పేర్కొన్నారు. కార్టూన్లు ద్వారా, వార్తల ద్వారా, హెడ్డింగుల ద్వారా ఎన్టీఆర్ ని ప్రజల్లో కించపరిచేలా రామోజీ రాసారని.. 1989 ఎన్నికల్లో ఓటమిలో రామోజీ పాత్ర ఉంది అంటూ దగ్గుబాటి రాశారు. దగ్గుబాటి రాసిన ఫేస్ బుక్ పోస్టింగ్ లింక్ కింద చూడవచ్చు.. https://www.facebook.com/Doctordaggubati/ లో స్పష్టంగా మొత్తం చూడవచ్చు..

Eenadu Ramojirao: Daggubati Sensational Post
Eenadu Ramojirao: Daggubati Sensational Post

రామోజీ రాతలు మొదటి నుండీ అంతే..!!

ఇక్కడ కాసేపు దగ్గుబాటి పోస్టింగ్ సంగతి పక్కన పెట్టేస్తే.. ఈనాడు రామోజీ వ్యవహారం మనం అర్ధం చేసుకోవచ్చు. ఒక పత్రిక ద్వారా ఎన్ని అడ్డదారుల్లో పయనించవచ్చో.. ఎన్ని వ్యవస్థలను శాసించవచ్చో.. ఎంత సంపాదించవచ్చో.. అన్నీ స్పష్టంగా చూపించిన ఘనుడు ఆయన. అవసరం అయితే పార్టీలకు భజన… అవసరం లేకపోతే ఆ పార్టీలను నిప్పు పెట్టె వార్తలు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా వార్తలు, కథనాలు రాసుకుంటూ జర్నలిజాన్ని నడిబజారుకీ చేర్చిన ఘనత “ఈనాడు”కి దక్కుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం… ఎవరేమనుకున్నా.., నది వీధిలో ఈనాడు దుర్భుద్ధి రాతలు సాక్ష్యాలతో దొరికిపోయినా ఇప్పటికీ ఆ సంస్థ అంతర్గత మీటింగుల్లో “మనం పత్రిక నిజాయితీకి నిలువుటద్దం.. మనం ఒక వ్యవస్థ.. జర్నలిస్టు నిజాయితీగా ఉండాలి.. మన పత్రిక నిప్పు, మనం న్యాయ మార్గంలో వెళ్తాము” అంటూ చాలా సొల్లు కబుర్లు చెప్తుంటారు. వారానికోసారి వీడియో కాన్ఫెరెన్సులు, నెలకోసారి మీటింగులు.. అందులో జరిగేది ఇటువంటి చర్చలే..!


Share

Related posts

బ్రాహ్మణవాదం…శ్రమశక్తి!

Siva Prasad

China: చైనా అడ్డంగా బుక్క‌వుతోందా..మ‌న‌కంటే ఎక్కువ అమెరికా ఫోక‌స్ ఎందుకు పెట్టింది?

sridhar

బిగ్ బాస్-4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్..! కంటెస్టెంట్ లూ వీరే…?

arun kanna