NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Eetala Rajendar: ఈయన వ్యూహం ఏమిటో..!? నేడు ఢిల్లీకి ఈటల..!?

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team

Eetala Rajendar: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం ఈటల రాజేందర్ మాత్రమే.. అక్కడ రాజకీయ వర్గాల్లో నిత్యం రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా ఉండేవారు.. కానీ గడిచిన పది రోజుల నుండి ఈటెల చుట్టూ మీడియా, సోషల్ మీడియా, పొలిటికల్ వర్గాలు తిరుగుతున్నాయి.. టీఆరెస్ నుండి అనధికారికంగా.. ఆ మంత్రివర్గం నుండి అధికారికంగా బహిష్కరణకు గురైన తర్వాత ఈటల తనలో కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. దూకుడు పెంచారు. మాటల్లో వాడి పెంచారు. కేసీఆర్ కుటుంబ వ్యవస్థ, పాలనలో అవినీతిపై గళం విప్పుతున్నారు. దీంతో పాటూ వరుసగా రకరకాల నాయకులతో భేటీలు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది..!

Eetala Rajendar: Today Delhi.. Important meets
Eetala Rajendar Today Delhi Important meets

Eetala Rajendar:  సోనియా సహా కాంగ్రెస్ నేతలతో కీలక భేటీ..!?

ఈటెల రాజేందర్ ప్రస్తుతం రాజకీయ కూడలిలో ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ నుండి ఆహ్వానం ఉంది. కాంగ్రెస్ నుండి ఆహ్వానం ఉంది. కొత్త పార్టీ ప్రతిపాదన, ఆలోచన కూడా ఉంది. కానీ ఆవేశ పడకూడదు. ఇది తనకు అత్యంత కీలకమైన రాజకీయ అడుగు. టీఆరెస్ లో రెండు దశాబ్దాల నుండి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఆ పార్టీలో నాలుగో స్థానంలో ఉండేవారు. అటువంటి ఈటలను కేసీఆర్ పొగ పెట్టారు. ఈ మధ్య ఈయన నడవడిక మారడం.., కేసీఆర్ ని అనుమానం రావడంతో ఇది మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఈటల లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ని ఓడించాలి. టీఆరెస్ ని పతనం చేయాలి. అందుకు కాంగ్రెస్ మంచిదా.., బీజేపీ మంచిదా..!? అనే దీర్ఘాలోచనతో ఉన్నారు. నేడు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలవాలని ఆలోచిస్తున్నారు.

Eetala Rajendar: Today Delhi.. Important meets
Eetala Rajendar Today Delhi Important meets

పది రోజుల నుండీ వరుసగా భేటీలు..!

రాష్ట్రంలో కరోనా ఉంది. భయపెడుతుంది. కానీ రాజకీయం మాత్రం ఆగడం లేదు. ఈయన గత పది రోజుల నుండీ తిరుగుతూ వరుసగా భేటీలు వేస్తూ వస్తున్నారు. మొదట రేవంత్ రెడ్డి, తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనంతరం డీ. శ్రీనివాస్, తర్వాత మల్లు బట్టి విక్రమార్క, తీన్మార్ మల్లన్న, కొండా సురేఖ దంపతులు.. ఇలా తెలంగాణ రాజకీయాలపై పట్టున్న పెద్దోళ్ళను, చిన్నోళ్లను కలుస్తున్నారు. అన్నీ అయ్యాక.. ఈరోజు లేదా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దోళ్ళను కలవనున్నారు. ఆయన లక్ష్యం సాధించడానికి కాంగ్రెస్ కరెక్ట్ అనుకుంటే వెళ్తారు. అయితే ఈటెల ను మొత్తం నడిపిస్తున్నది.. రేవంత్ రెడ్డి అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈటల కాంగ్రెస్ కి వచ్చినా అది రేవంత్ ప్రోద్బలమే.. సొంత పార్టీ పెట్టినా అది రేవంత్ పరోక్ష సలహానే అని చెప్పుకోవచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju