NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ జనసేన కీలక నేత కూడా పక్క చూపులు చూస్తున్నారా?

Janasena : Important Political Decisions

జనసేన లో పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానంలో ఉన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా పక్క చూపులు చూస్తున్నారని సమాచారం. జనసేనకే మనుగడ ఉండదని, ఆ పార్టీలో ఉంటే తనకీ ఎదుగుదల ఉండదన్న నిర్ణయానికి వచ్చిన మనోహర్ పవర్ పార్టీపై దృష్టి పెట్టారంటున్నారు.

Even the key leader of that Janasena is looking sideways
Even the key leader of that Janasena is looking sideways

నిజం చెప్పాలంటే ప్రస్తుతం జనసేనలో పవన్ కల్యాణ్ కి తోడూ నీడా మనోహరే..ఇక పవన్ ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా గానీ, రాష్ట్రంలో వివిధ సమస్యలపై సమావేశాలు కానీ, ఆందోళనలు, ఉద్యమాలు కానీ, చర్చలు కానీ, ఇలా ఏదైనా జరిగిన నాదెండ్ల మనోహర్, పవన్ పక్కన ఉండాల్సిందే. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాల్లో గెలవలేక పోవడంతో ఆ పార్టీ తరఫున ఆ పార్టీ తరఫున విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ,జనసేన సిద్ధాంత కర్తగా చెప్పుకునే నిజం రచయిత రాజు, మాజీ సమాచార శాఖ హక్కు కమిషనర్ విజయ్ బాబు తదితరులు అందరూ పవర్స్టార్ పార్టీకి గుడ్బై చెప్పేశారు.

జనసేన

Even the key leader of that Janasena is looking sideways
Even the key leader of that Janasena is looking sideways

కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా వైసిపి పంచన చేరారు. ఇప్పుడు జనసేన లో కాస్త ఫేస్ వాల్యూ కలిగిన నాయకుడంటే మనోహరే కనిపిస్తారు.అయితే ఇప్పటి వరకు మనోహర్ తనకు సాధ్యమైనంత రీతిలో జనసేనను బాగానే ముందుకు తీసుకొచ్చారు.కానీ ఎంత చేసినా జనసేన గ్రాఫ్ పెరగకపోవడం,పవన్ కల్యాణ్ పై ప్రజలకు నమ్మకం కుదరకపోవడం,ఆయన కూడా సినిమాలు రాజకీయాలంటూ రెండు పడవలపై ప్రయాణిస్తుండడం తదితర కారణాలను విశ్లేషించిన మనోహర్ ఇక ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

Even the key leader of that Janasena is looking sideways
Even the key leader of that Janasena is looking sideways

బిజెపి జనసేన పొత్తు కూడా రాష్ట్రంలో వర్కవుట్ కాదని మనోహర్ భావిస్తున్నారు.పవన్ కల్యాణ్పై ఉన్న టిడిపి ముద్ర ఇప్పట్లో చెరగడం కష్టమని మనోహర్ భావిస్తున్నారు. అన్నిటికీ మించి మరో టెర్మ్ వరకు వైసీపీకి ఢోకా లేదని జగన్ 2024 లో కూడా అధికారం లోకి వస్తాడని మనోహర్ లెక్కలు వేశారట.దీంతో ఆయన ఫ్యాను గాలిలో సేదతీరుదామన్న ఆలోచనతో ఇటీవలే తెనాలి వైసిపి ఎమ్మెల్యే శివకుమార్ తో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది.తెనాలి నుండి మనోహర్ రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం శివకుమార్ చేతిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ ఓడిపోయారు. ఇప్పటికే రాజకీయంగా పదేళ్లు వెనక్కిపోయిన మనోహర్ 2024 నాటికైనా ఏదో ఒక చైర్లో కూర్చోవాలన్న తలంపుతో రాజకీయ పావులు కదుపుతున్నారు.ఇది నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ కు షాకింగ్ న్యూసే!

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju