NewsOrbit
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని పర్యటనపై వైసిపి రాజకీయం చేసిందని విమర్శించారు.

జడ్ ప్లస్ భద్రతలో ఉన్న నాయకుడు ప్రయాణిస్తున్న బస్సుపై డిఎస్‌పి సమక్షంలోనే బయటి నుండి వచ్చిన వ్యక్తులు దాడి చేస్తుంటే  పోలీసులు చోద్యం చూశారని అన్నారు. చంద్రబాబుపై దాడి చేసింది రియల్టర్, రైతు అని చెప్పడం, ఈ దాడిని భావ వ్యక్తీకరణ స్వేచ్చగా అభివర్ణించడం దారుణమని ఉమా పేర్కొన్నారు. నిన్న జరిగిన ఘటనపై సిఎం జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని ఒక మంత్రి, శ్మశానం అని మరో మంత్రి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఉమా అన్నారు. 33 వేల ఎకరాలు రైతులు ఇస్తే పందులు, దున్నపోతులు తిరుగుతున్నాయని అవమానిస్తారా అని ప్రశ్నించారు.

పేదవాళ్లకు, ఎమ్మెల్యేలకు, ఎన్‌జివోలకు, ఐఎఎస్‌లకు ఇళ్లు నిర్మిస్తే సున్నాలు వేసి ఇవ్వడానికి జగన్‌కు చేతులు రావడం లేదని అన్నారు. కొడాలి నానికి బూతుల మంత్రిగా బిరుదు ఇవ్వొచ్చన్నారు. మంత్రుల బూతల భాషపై జగన్ వివరణ ఇవ్వాలన్నారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినా కూడా సిఎం జగన్, మంత్రులకు అభద్రతాభావం ఎందుకని ప్రశ్నించారు. రాజధానిని రక్షించేందుకు డిసెంబర్ అయిదవ తేదీన రాజకీయ పక్షాలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమా తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

Leave a Comment