NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ పార్టీల రాజకీయాలు వివరించండి: బాబు

అమరావతి, జనవరి 19: కోల్‌కతా ర్యాలీకి 20కిపైగా పార్టీలు పాల్గొన్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రాష్ట్ర పార్టీ నేతలతో ‘ఎలక్షన్ మిషన్ 2019’పై చంద్రబాబు శనివారం టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

కోల్‌కతా ర్యాలీకి బిజెపియేతర పక్షాల్లో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వైసిపి అధ్యక్షుడు జగన్ హజరుకావడం లేదని, వీరు ప్రధాని వెంటే ఉన్నారని స్పష్టమవుతుందని చంద్రబాబు అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అసుల లేదు..అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు బిజెపి నేతలు ప్రకటించడం హస్యాస్పదంగా ఉందని, 29 సార్లు ఢిల్లీ వెళితే మొండిచేయి చూపడమే ప్రాధాన్యతా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మోదికి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అది బిజెపికి ప్రతిపక్షమే కాదని అన్నారు. రాష్ట్రంపై టిఆర్ఎస్ నేతల ద్వేషాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. టిఆర్ఎస్‌తో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు బాబు పిలుపు నిచ్చారు. వరంగల్లులో రాళ్లేసిన వార్లతో జగన్ లాలూచి పడ్డారని, కేసుల కోసం మోదీతో, ఆస్తుల కోసం కెసిఆర్‌తో జగన్ లాలూచి రాజకీయాలు చేస్తున్నారని బాబు అన్నారు.

బిజెపి దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తుందని, దీనికి శబరిమలలో ఉద్రిక్తతలే ఒక ఉదాహారణ అని చంద్రబాబు అన్నారు. కర్నాటకలో బిజెపి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని అన్నారు. డబ్బు ఖర్చు పెట్టే అభ్యర్థుల కోసం వైసిపి వెతుకుతొందని, ఆ పార్టీ అభ్యర్థులు ప్రజల్లో ఉండే వారు కాదని బాబు అన్నారు.

రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంట్, 150 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించేలా సమిష్టి కృషి చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Leave a Comment