NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి పటేల్ కన్నుమూత..!!

 

(గాంధీనగర్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గురువారం ఉదయం శ్వాస సంబంధమైన ఇబ్బంది ఏర్పడటంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కేశూభాయ్ పటేల్ రెండు పర్యాయాలు గుజరాజ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత నెలలోనే సోమనాధ్ మందిర్ ట్రస్ట్ కు రెండవ సారి అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. 1930 జూలై 24న జూనాఘడ్ జిల్లా విశావధర్ పట్టణంలో జన్మించిన కేశూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత.  గుజరాత్ కు 1995 మార్చి నుండి 1995 అక్టోబర్ వరకు మొదటి దఫా, 1998 మార్చి నుండి 2001 అక్టోబర్ వరకు రెండవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001లో గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి రావడంతో ఆయన సీఎం పదవి నుండి తప్పుకున్నారు. 2012లో బీజేపీ నుండి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పార్టీ స్థాపించారు. 2012లో చివరి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు కేశూభాయ్ పటేల్. ఆ తరువాత ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అనారోగ్య కారణంగా 2014లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  మొత్తం కేశూభాయ్ పటేల్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు నలుగురు సంతానం. కేశూభాయ్ పటేల్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

author avatar
Special Bureau

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju