హద్దు మీరిన సిద్ధరామయ్య

కర్నాటక, జనవరి 28  నన్నే ప్రశ్నిస్తావా అంటూ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళ చేతిలోని మైక్‌ను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాగడంతో దాంతోపాటు చున్నీజారింది.  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య. సోమవారం తన కుమారుడి నియోజకవర్గంలో ఒక సమావేశానికి హాజరయ్యారు. అక్కడ తనను నిలదీసిన జమీలా అనే మహిళను ఉద్దేశించి గద్దిస్తూ మాట్లాడారు.    అమెచేతిలోని మైకును మాజీ ముఖ్యమంత్రి లాక్కున్నారు. మైకుతోపాటు చున్నీకూడా టేబుల్‌పై జారింది.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దురుసు ప్రవర్తనతో కూడిన వీడియో వైరల్ అయ్యింది.

మీ కుమారుడి నియోజకవర్గంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అంటూ ఆమె ప్రశ్నించింది. దీంతో ఆయనకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఆమెను కూర్చోమంటూ వారించాడు. అప్పటికీ ఆమె సమస్యలను ఏకరవు పెట్టడంతో సహనం కోల్పోయారు.

టేబుల్ మీద చెయ్యిపెట్టి మాట్లాడుతుండగా ఆయన కోపంతో తనను దుర్భాషలాడారని ఆమె మీడియాతో అన్నారు.

మైసూరులో ఈ  సంఘటన జరిగింది.

సమావేశంలో పెద్దగా మాట్లాడుతున్న అమెను వారించేందుకు సిద్ధరామయ్య మహిళ నుండి మైకు లాక్కున్నారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్పారు.