సీన్ లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..!!

మహమ్మారి కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తుంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే అమెరికా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకుంది. ప్రాణ నష్టం పరంగా చూసుకుంటే ఆర్థికంగా చూసుకున్న కరోనా దెబ్బకు అమెరికా కాకా వికలమైంది అని చెప్పవచ్చు. సామాజిక దూరం మరియు మాస్క్ అవసరాల గురించి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు ప్రజల కోసం తీసుకుంటూనే మరోపక్క వ్యాక్సిన్ తీసుకురావటానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది.

Obama, Bush, Clinton may take COVID-19 vaccine on TV to prove safety - Axiosఇప్పటికే అమెరికాలో పలు బడా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తీసుకురావడానికి రెడీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. ఇలాంటి తరుణంలో వచ్చే వ్యాక్సిన్ సక్సెస్ అవుతుందో లేదో అన్న విషయం తెలుసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై  ప్రజలకు రకరకాల అనుమానాలు తో అటు భయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు భరోసా కల్పించడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన కామెంట్లు చేశారు.

 

వ్యాక్సిన్ వచ్చిన వెంటనే బహిరంగంగా ప్రజల ముందు అది కూడా మీడియా సమక్షంలో వేయించుకుంటా అంటూ ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా అందరికంటే ముందుగా నేనే వ్యాక్సిన్ తీసుకుంటానని అది కూడా ప్రజలకు ధైర్యం కలిగిస్తుంది అంటూ ప్రకటించారు. ఒక్క బరాక్ ఒబామా మాత్రమే కాక మాజీ అధ్యక్షులు  బిల్ క్లింటన్ కూడా పబ్లిక్ గా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్దంగా ఉన్నారని ఆయన అధికార ప్రతినిధి యురేనా వెల్లడించారు.మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సైతం ఇదే ప్రకటన చేశారు.