NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇంటి పోరు లో ఈదుతున్న గల్లా జయదేవ్ !

తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీల లో గుంటూరు నుండి వరుసగా విజయం సాధించిన గల్లా జయదేవ్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది పూర్తి కాగా కాలంలో ఆయన దూకుడుగానే వ్యవహరించారు కానీ తన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి మాత్రం ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోందట. విషయమే ఇప్పుడు టిడిపి పార్టీలో హాట్ టాపిక్.

 

Guntur MP Galla Jayadev: Lok Sabha polls: Galla Jayadev promises ...

నిజానికి చంద్రబాబు అనేక సందర్భాల్లో గల్లా దూకుడిని ప్రశంసించారు. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులకు పిలుపునిచ్చిన సందర్భంలో గల్లా జయదేవ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి అసెంబ్లీ వరకు వెళ్ళిన తీరు అతని సత్తా తెలియజేసేది. ఇక ఆయన దూకుడు కి ఒక రోజు జైల్లో కూడా గడిపిన జయదేవ్ తన సొంత నియోజకవర్గ ప్రజలను మాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారట. ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ ఇంట్లో ఈగల మోత లాగా ఉందట ఆయన వ్యవహారం. ఏడాది పూర్తయినా ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాడన్న వాదన బలంగా వినిపిస్తోంది.

కొన్నాళ్ళ కిందట ఎంపీ కార్యాలయం ముందు స్థానికులు ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. విషయం చంద్రబాబు వద్దకు వెళ్లగా ఆయన కొన్ని సూచనలు ఇచ్చి కనీసం వారంలో మూడు రోజులైనా నియోజకవర్గంలో ఉండాలని మరియు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ అతని వ్యక్తిగత మైలేజీని పెంచుకోవడమే కాకుండా పార్టీ కి ప్రయోజనకరంగా వ్యవహరించాలని సూచించారట.

ఇక గల్లా చూస్తే ఏమో తన వ్యాపార వ్యవహారాలు మరియు వ్యక్తిగత కారణాలు తనకు ఉన్నాయని మరియు అధిష్టానం విషయంలో తనని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతోందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడట. పైన ప‌రిస్థితిని చ‌క్కదిద్ది.. ఎంపీ త్వర‌లోనే వ‌స్తార‌ని అతని మనుషులు స‌ర్దిచెబుతున్నా... ఇంత జ‌రిగినా.. అసలు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ ప్రజ‌ల‌కు మాత్రం స‌మాధానం చెప్పలేద‌ని అంటున్నారు.

ఇక పోతే గలా స్తానిక్ంగా చేయల్సిన అభివృద్ధిపై ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఎలా దృష్టి పెడతారు అన్నది టిడిపి వర్గాల ప్రశ్న. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీ పార్టీకి మారిపోయారు. ఇక ఇవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న గల్లా తీరు మరియు పార్టీ గుంటూరు జిల్లా లోని స్థానిక నాయకులను ఏకం చేయలేకపోతున్న అతని అలసత్వం పైన పార్టీ హైకమాండ్ కొద్దిగా గుర్రుగానే ఉందని తెలుస్తోంది.

ఇక ఎన్నికలకు నాలుగేళ్ళు ఉంది కాబట్టి ముందు తన వ్యాపారం చక్కబెట్టుకునే పనిలో ఆయన ఉన్నడని టిడిపిలో కొంతమంది బాబుకు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారట. ఇలాంటి సందేహాల నడుమ టిడిపి పార్టీ లో గల్లా భవిష్యత్తు ఎలా మారబోతుంది మరియు ఇంటిపోరు లో ఒంటరిగా ఈదుతున్న గల్లా చివరికి తీరం చేరుతాడా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికర విషయం.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk