NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గల్లా మరీ ఇంతలా బెదిరిపోయాడా… అడ్రెస్సే లేడు…?

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు జగన్ దూకుడును తట్టుకోలేక ఇటు సొంత పార్టీ నేతల వ్యతిరేకతను నిలువరించలేక బాబు నానాపాట్లు పడుతున్నారు. క్లిష్ట సమయంలో గళం విప్పాల్సిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. అటువంటివారిలో గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఒకరు.


ఇది ఇప్పటిది కాదు..!

గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గత కొంతకాలంగా దూరంగా ఉన్నారు. అసలు చెప్పాలంటే గుంటూరులో కూడా లేరు. కరోనా సమయంలో ఆయన కనిపించడం లేదని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు రాజధాని అమరావతి తరలింపు ప్రక్రియ హాట్ హాట్ గా సాగుతున్న వేళ ఎంపీ గల్లా జయదేవ్ అసలు అందుబాటులో లేరని ప్రచారం సాగుతోంది. గత రెండు నెలలుగా పార్టీ నేతలకు ప్రజలకు అందుబాటులో లేని ఆయన తొలి నుండి గాని విజిటింగ్ ఎంపీ గానే పేరు సంపాదించారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఎప్పుడూ ఆఫీసు తలుపులు తెరిచి ఉన్నాయి తప్ప గల్లా ఆఫీసులో లో ఉండనే ఉండడని అంటుంటారు. దీనిపై బాబు కూడా పిలిచి ఆయనకు క్లాస్ పీకారు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి.

ఏమైపోయాడో….

సరే గతమంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరొక ఎత్తు. పూర్తిగా విపక్షంలో ఉండటం లో పని లేదా అనుకున్నారో ఏమో కానీ జయదేవ్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు అమరావతి రాజధాని తరలింపు ప్రక్రియ ప్రభుత్వం వేగం చేస్తుంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హల్లా జయదేవ్ ఎక్కడికి వెళ్లారు అన్నదే ప్రశ్న. ఇక ఇలాంటి సమయంలో బాబుకు అండగా ఉండకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా పెద్ద తేడా లేదు అని అంటున్నారు టిడిపి పార్టీ మద్దతుదారులు.

దీనికి కారణం ఆ భయమే…?

ఒక రకంగా చెప్పాలంటే గల్లా వెనుకడుగు వేయడానికి కారణం ప్రభుత్వం నుండి వస్తున్న వేధింపులు అన్నది కొందరి వాదన. తన కుటుంబానికి చెందిన అమర్ రాజా సంస్థ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాదాపు 253 ఎకరాలను వారు వెనక్కి తీసుకున్నారు. అయితే దీనిపై గల్లా కుటుంబం హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుంది అనుకోండి అది వేరే విషయం.

కానీ భవిష్యత్తులో కూడా తమకు ఇలాంటి సమస్యలే ప్రభుత్వం నుండి ఎదురవుతాయని భావించిన గల్లా ప్రస్తుతానికి క్షేత్రస్థాయి రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మరి కీలక సమయంలో ఇలా పార్టీకి హ్యాండ్ ఇవ్వడం కరెక్టే అంటారా…?

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?