NewsOrbit
రాజ‌కీయాలు

గన్నవరంలో వంశీ × దేవినేని..! పోరు షురూ..!!

gannavaram battle between vamsi and devineni

రాష్ట్రంలో రాజకీయం ఒక దశలో తిరుగుతుంటే.. గన్నవరంలో మాత్రం మరో దశలో తిరుగుతోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. తానేంటో నిరూపించుకునేందుకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా కొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. ఈనేపథ్యంలో వల్లభనేని రాజీనామా చేస్తారా.. ఒకవేళ్ చేస్తే.. ఉప ఎన్నిక వస్తే.. స్థానిక వైసీపీ నాయకులుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఆయనకు మద్దతు ఇస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

gannavaram battle between vamsi and devineni
gannavaram battle between vamsi and devineni

వంశీ రాజీనామా చేస్తారా.. లేదా?

సీఎం జగన్ ఓకే అంటే రాజీనామాకు సిద్ధం అంటూ వంశీ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకే వెళ్లని వైసీపీ.. పనిగట్టుకుని గన్నవరం ఉప ఎన్నికకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. అసలే అక్కడ వైసీపీ త్రిముఖంగా ఉంది. రీసెంట్ గా వల్లభనేని, యార్లగడ్డల చేయి చేయి కలిపారు సీఎం. అయినా.. స్థానిక పరిస్థితులపై సీఎం నమ్మకంగా లేరని అంటున్నారు. దీంతో వంశీ రాజీనామా ఇప్పట్లో ఉండదనే తెలుస్తోంది.

వంశీకి వీరంతా సహకరిస్తారా..?

గన్నవరంలో వైసీపీకి వీల్ చైర్ గేమ్ నడుస్తోంది. యార్లగడ్డ, దుట్టా.. వంశీకి ఎదురు నిలుస్తున్నారు. వంశీ టీడీపీలో ఉన్నప్పటి నుంచీ వీరి మధ్య వైరం అలానే కొనసాగుతోంది. ఇప్పుడు వైసీపీకి మారినా గత పరిస్థితులను వారు మరచిపోవడం లేదు. టీడీపీలో ఉండగా తమ మీద పెత్తనం చూపించిన వంశీని.. వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా చేసుకుని తమ నెత్తి మీద కూర్చోపెట్టుకోలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

టీడీపీ దేవినేని ఉమా రెడీ..!

గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే నిలబడేందుకు తాను సిద్ధమంటూ దేవినేని ఉమ ఇప్పటికే ప్రకటించారు. గన్నవరంలో టీడీపీకి బలం ఎక్కువ. ఇప్పటివరకూ 14 సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారే ఓడిపోయింది. దీంతో గన్నవరం తమకు అత్యంత కీలకంగా టీడీపీ భావిస్తోంది. ఉప ఎన్నిక జరిగితే గన్నవరంలో గెలవాలని పట్టుదలగా ఉంది. చంద్రబాబును వల్లభనేని టార్గెట్ చేసిన విధానానికి టీడీపీ వంశీపై చాలా గుర్రుగా ఉంది. ఎప్పుడు ఆ పరిస్థితి వచ్చినా సిధ్దంగా ఉండేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. మరి.. పరిస్థితులు ఎటు నడిపిస్తాయో చూడాలి.

 

 

author avatar
Muraliak

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?