NewsOrbit
రాజ‌కీయాలు

కొత్త చూపులు చూస్తున్న గంటా.. అవంతితో తంటానే కారణమా..?

AP Politics ; Ganta Resignation Insider Reasons

టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కొత్త చూపులు చూస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారంటూ అనేక పుకార్లు వస్తున్నాయి. ఆయన ఆగష్టు 9న లేదా 16న లేదా 22న వైఎస్సార్సీపీలో చేరుతారంటూ ముహూర్తాలు పెట్టేశారు. కానీ తేదీలు మారిపోయాయి కానీ ఏమీ జరగలేదు. వైఎస్సార్సీపీలో చేరదామనుకున్న గంటా ప్రస్తుతం సైలెన్స్ అయిపోయారు. ఆయనపై మరో కొత్త ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తారంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. ఎందుకా.. అని ఆరా తీస్తే..

ganta srinivasa rao in confussion
ganta srinivasa rao in confussion

అవంతి అడ్డు.. విజయసాయిరెడ్డితో విబేధాలు..

 గంటా ఏపార్టీలో ఉంటే ఆపార్టీలో అజమాయిషీ చెలాయించే వ్యక్తి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గంటా ఉంటారని పేరు. ఆయన రాజకీయ జీవితంలో ప్రతిపక్షంలో ఎప్పుడూ లేరు. ప్రస్తుతం ఆయనకు విశాఖపై పట్టు కావాలి. ఇందుకు ఆయన వైఎస్సార్సీపీలో చేరాలని ప్రయత్నాలు చేశారు. అయితే.. అవంతి రూపంలో ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అవంతి ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆయనదే హవా. గంటాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గంటాకు మరోవైపు విజయసాయిరెడ్డి కూడా అంత సంతృప్తిగా లేరు. రెండు నెలల క్రితమే గంటా అవినీతిపై ట్వీట్ చేశారు కూడా. దీంతో గంటాకు రెండు వైపులా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో ఒక కీలక వ్యక్తి సలహాతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.

చిరు సలహా.. సామాజికవర్గం.. ఆసరా..

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో తన మార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్యం ఏపీలోని కాపు నాయకులను బీజేపీలో చేర్చడం. రెడ్డి వర్గానికి జగన్, కమ్మ వర్గానికి చంద్రబాబులా.. రాష్ట్రంలో కాపు వర్గానికి బీజేపీ అండగా ఉంటుందనే భరోసా కాపుల్లో కలిగించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే అధ్యక్షుడయ్యాక చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను, ముద్రగడను కలిశారు. కాపు వర్గంలోని కీలకమైన వంగవీటి రాధాకృష్ణ, గంటా శ్రీనివాసరావులను పార్టీలో చేర్చుకుని బీజేపీని పటిష్టం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈమేరకే గంటాకు చిరంజీవి సలహా ఇచ్చారని కూడా అంటున్నారు. దీంతో గంటా వైఎస్సార్సీపీ కంటే బీజేపీ బెటర్ అని ఆలోచిస్తున్నారు. మరి.. ఆయన నిర్ణయమేంటో త్వరలో తేలబోతోంది. మొత్తానికి ఆయన మాత్రం టీడీపీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది.

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju