NewsOrbit
రాజ‌కీయాలు

పార్టీలకు షాకిచ్చిన గ్రేటర్ ఓటర్..! 2016-2020 ఓటింగ్ లెక్కలివే..!!

ghmc elections voting in 2016 and 2020

రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి మ్యాజిక్స్ జరుగుతాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి ఒక్కో పార్టీ హవా ముందే తెలిసిపోతూ ఉంటుంది. 1995లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2014, 2018ల్లో తెలంగాణలో టీఆర్ఎస్, 2019లో వైసీపీ.. పార్టీల గాలి వీచిన సందర్భాలే. ఆయా సందర్భాల్లో ఓటింగ్ శాతం కూడా గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే విధంగా ఓటింగ్ ప్రభావం చూపింది. పోలింగ్ రోజున ప్రజలు ఓటింగ్ కు రాకపోవడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇదే పార్టీల గెలుపుపై ప్రభావం చూపిందని చెప్పాలి. టీఆర్ఎస్ కు తగ్గిన సీట్లు, బీజేపీకి పెరిగిన బలానికి ఓటింగ్ శాతమే శాసించిందని చెప్పాలి. 2016, 2020 ఓటింగ్ లో తేడాలను పరిశీలిస్తే..

ghmc elections voting in 2016 and 2020
ghmc elections voting in 2016 and 2020

2016–2020 మధ్య ఓటింగ్ తీరు..

2016లో టీఆర్ఎస్ కు 14,68,618 ఓట్లు.. 43.85 శాతం రాగా.. ప్రస్తుతం 12,04,167 ఓట్లు.. 35.56 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో బీజేపీకి 3,46,253 ఓట్లు.. 10.34 శాతం రాగా.. ప్రస్తుతం 11,95,711 ఓట్లు.. 35.56 శాతం ఓటింగ్ నమోదైంది. 2016లో ఎంఐఎంకు 5,30,812 ఓట్లు.. 15.85 శాతం రాగా, ప్రస్తుతం 6,30,866 ఓట్లు.. 18.76 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో కాంగ్రెస్ కు 3,48,388 ఓట్లు.. 10.40 శాతం రాగా, ప్రస్తుతం 2,24,528 ఓట్లు.. 6.67 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో టీడీపీకి 4,39,047 ఓట్లు.. 13.11 శాతం ఓటింగ్ రాగా, ప్రస్తుతం 55,662 ఓట్లు.. 1.66 శాతం ఓటింగ్ వచ్చింది. టీఆర్ఎస్ కు 2016 – 2020కి 2,64,451 ఓట్లు తగ్గాయి.

2023లో విజయానికి కష్టపడాల్సిందే..

ప్రస్తుతం టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ఓట్ల తేడా 8,456.. ఓటింగ్ శాతం 0.25 మాత్రమే. 2016లో దూసుకెళ్లిన టీఆర్ఎస్ కారుకు 2020లో బీజేపీ బాగానే బ్రేకులు వేసింది. ప్రజలు ఓటింగ్ కు రానప్పుడే టీఆర్ఎస్ కు బ్రేక్ పడబోతోందని దాదాపు అంచనాలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉప ఎన్నిక విజయాలను కంటిన్యూ చేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ ను బలహీనం అయ్యేలా చేసిన కేసీఆర్ కు బీజేపీ తమకు మేకులా తయారవుతుందని ఊహించి ఉండరు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలంటే ఇప్పటినుంచే మేల్కోవాలి.. బీజేపీ గెలవాలంటే మరింత బలపడాలి.

 

 

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju