రాజ‌కీయాలు

Ys Jagan: లండన్ న్యాయస్థానంలో నెగ్గిన జగన్ ప్రభుత్వం..!!

Share

Ys Jagan: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాకియా సంస్థ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై లండన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ మన్యం కి బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి వ్యతిరేకంగా దుబాయ్ కి చెందిన రస్ అల్ ఖైమా కంపెనీ… ఒప్పందం రద్దు చేసుకోవడం తో రాకియా కంపెనీ ఏపీ ప్రభుత్వం పై తమకు నష్టపరిహారం ఇవ్వాలని లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు 273 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని రాకియా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చింది.

GOI and Govt. of AP wins Case in International Arbitration Tribunal, London against Rakia.

ఈ విషయంలో పలుమార్లు ప్రభుత్వం తరపున ప్రతినిధులు మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినా గాని రాకియా ఎక్కడ వెనక్కి తగ్గలేదు అంగీకరించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. సీఎం జగన్ సూచనలతో అధికారులు మరియు న్యాయ నిపుణులు పకడ్బందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీంతో లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయనిపుణులు ప్రతినిధులు వినిపించిన వాదనలను ఏకీభవిస్తూ… ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

దీంతో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది. 2007వ సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్ వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాకియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో రాకియా కంపెనీతో ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఒప్పందం రద్దుతో రాకియా కంపెనీ 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేయగా… ఈ విషయంలో న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం పోరాడి చివరికి గెలిచింది.


Share

Related posts

Pavan Kalyan: ఫ్యాన్స్ పై పవన్ కి కోపమెందుకు..!? ఎందుకిలా మారిపోయారు..!?

Srinivas Manem

రాజకీయంలో సచిన్ వ్యూహం అదుర్స్..!!

somaraju sharma

ఉలిక్కిప‌డిన విశాఖః విజ‌య‌సాయిరెడ్డి పేల్చిన బాంబు మామూలుగా లేదుగా

sridhar