కరోనా విషయంలో భారతీయులకు కాస్త ఊరటనిచ్చే వార్త..!!

Share

మహమ్మారి కరోనా వైరస్ చైనా నుండి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన టైములో, పక్కనే ఇండియా ఉండటంతో పైగా దేశ జనాభా ఎక్కువగా ఉండటంతో ఇండియన్స్ చాప్టర్ క్లోజ్ అని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ అద్భుతంగా భారతీయులు కరోనా వైరస్ ని మొదటిలో ఎదుర్కొనటం జరిగింది. ఆ టైంలో యూరప్ దేశాలు కరోనా వైరస్ ని ఎదుర్కోవటానికి నానా తంటాలు పడ్డాయి. 4.0 లాక్ డౌన్ వరకు వైరస్ దేశంలో కంట్రోల్ లో ఉంది. రోజుకి 1500 నుండి 2000 మధ్య కొత్త పాజిటివ్ కేసులు బయటపడేవి. సీన్ కట్ చేస్తే మూడు నెలల తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భయంకరంగా దేశంలో కరోనా వ్యాప్తి చెందింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకు ఇరవై వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 

Covaxin: Understand India's COVID-19 Vaccine Candidateపైగా ఇటీవల గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు రావడంతో రాబోయే రోజుల్లో ఇండియాలో లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ రెడీ అయినట్లు ఆగస్టు15 స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక కామెంట్లు చేసింది. అయితే తాజాగా ఇప్పుడు పూర్తి సంప్రదాయ పద్ధతిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని అప్పటివరకు భద్రత కల్పిస్తామని చెప్పుకొచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న…, దేశంలో రికవరీ రేటు 62 శాతం ఉందని తాజాగా వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు. ఇది కచ్చితంగా భారతీయులకు ఊరటనిచ్చే వార్త అని అంటున్నారు. ఎక్కువ మరణాలు 60 నుండి 70 ఏళ్ల లోపు వారు చనిపోతున్నారని అరవై కింద ఉన్న వయసువాళ్ళు చాలావరకు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 


Share

Related posts

చాకోలేట్ దేవుడు.. చాక్లేట్లంటేనే ఆ దేవుడికి ఇష్టం.. ఇంతకీ ఆయన ఏ దేవుడంటే?

Varun G

బ్రేకింగ్: బిగ్ బాస్ 4 ను అనౌన్స్ చేసిన స్టార్ మా

Vihari

వామ్మో చైనా ఇంత దరిద్రపు బుద్ధితో ఉందా .. ఈ విషయం తెలిస్తే మీ రక్తం ఉడికిపోతుంది !!

somaraju sharma