NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో ముందడుగు

ఏపి రాజధాని అమరావతిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు కల్పిస్తూ ఇటీవలే ప్రభుత్వం సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా రాజధాని ప్రాంత గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయింపునకు గానూ ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Amaravati Capital

సీఆర్డీఏ చట్ట సవరణ మేరకు ప్రత్యేకంగా ఈ జోన్ ను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ ను ఇచ్చింది ప్రభుత్వం. సీఆర్డీఏ ప్రతిపాదన మేరకు ఆర్ – 5 జోన్ పేరుతో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ముసాయిదాలో పేర్కొంది. రాజధాని ప్రాంతంలోని అయిదు గ్రామాల పరిధిలో పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాలతో పాటు తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ – 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

AP CM YS Jagan

జోనింగ్ లో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు ప్రభుత్వం 15 రోజులు గడువు ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకూ సీఆర్డీఏ కార్యాలయంలో గానీ, ఈ మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా ప్రజలు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే ఓ పక్క అమరావతి రాజధాని వివాదంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణలపైనా హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి.

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ అడ్డుకుంటోందంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తే ఆ నెపాన్ని టీడీపీపై వేయడం ద్వారా పేద ప్రజల మద్దతును వైసీపీ గెయిన్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి మరి.

TRS MlAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆడియోలు లీక్ చేసిన టీఆర్ఎస్ .. బీజేపీ నీచ రాజకీయ బాగోతాలకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ..

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju