Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మంచి ప్రజాదరణ కలిగిన నాయకులలో టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. తెలంగాణ రాజకీయాలలో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడిగా సిద్దిపేట నుండి భారీ స్థాయిలో హరీష్ రావు రికార్డు నెలకొల్పడం అందరికీ తెలిసిందే. ప్రజలతో కలిసి పోవటం మాత్రమే కాక సమస్యల విషయంలో త్వరగా స్పందిస్తూ మరోపక్క ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే రీతిలో కౌంటర్లు వేస్తూ హరీష్ రావు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ఉంటారు.
అటువంటి హరీష్ రావు తాజాగా ఇటీవల జహీరాబాద్లో క్రికెట్ పోటీ టోర్నమెంట్లో ఫోర్లు సిక్సర్లతో భారీ స్థాయి స్కోరు చేసి జట్టును గెలిపించడం లో కీలక పాత్ర పోషించారు. రాజకీయంలో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించిన అట్లే ఈ గేమ్ లో ప్రత్యర్థి ఆటగాళ్ల బౌలర్ల ని ముప్పుతిప్పలు పెట్టారు. కలెక్టర్ టీం తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచి కలెక్టర్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది.
తర్వాత హరీష్ రావు టీం బ్యాటింగ్ కు దిగింది. తన బ్యాటింగ్ తో హరీష్ రావు మెరుపులు మెరిపించాడు. సిక్సర్లు ఫోర్లతో ప్రొఫెషనల్ క్రికెట్ గేమ్ ను తలపించాడు. ఈ క్రమంలో ఆటను చూసిన ప్రేక్షకులు హరీష్ రావు బ్యాటింగ్ చూసి షాక్ అయిపోయారు. ఇప్పుడే కాదు గతంలో కూడా క్రికెట్ పోటీలలో హరీష్ రావు పాల్గొని భారీ స్థాయి స్కోర్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?