దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ హామీలు ఇస్తున్న హరీష్ రావు..!!

Share

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలలో గెలవడానికి అన్ని ప్రధాన పార్టీలు ఎవరికివారు వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతి పార్టీ నాయకుడు, క్యాడర్ మొత్తం ప్రజలకు దగ్గర అయ్యేవిధంగా కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జరగబోయే ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గెలవడం అంత సునాయాసం కాదు అనే రీతిలో సర్వేలు వస్తున్నాయట. కరోనా వైరస్ కంట్రోల్ చేసే విషయంలో గాని… వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరులో గాని విఫలమైనట్లు ప్రజలు సంతృప్తిగా లేరన టాక్ నడుస్తోంది.

T Harish Rao slams Congress, TDదీంతో ఇదే విషయం టిఆర్ఎస్ హైకమాండ్ దాకా వెళ్లడంతో… ఉప ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని దుబ్బాక ప్రజలపై వరాల జల్లు కురిపించడానికి పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక బాధ్యతలను తీసుకున్న హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. మరోపక్క ఓటర్లు కూడా ఈ ఉప ఎన్నికను నియోజకవర్గ అభివృద్ధి అయ్యే రీతిలో నాయకులకు పలు డిమాండ్లను సూచిస్తున్నారట.

 

అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉండటంతో మంత్రి హరీష్ రావు ఎదుట.. నియోజకవర్గంలో డివిజన్ కేంద్రం ఏర్పాటుతో పాటు ఆర్డిఓ కార్యాలయం తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే కచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు తెలిపారట. దీంతో మంత్రి హరీష్ రావు కూడా నియోజకవర్గ ప్రజలు సూచించిన డిమాండ్లకి ఓకే చెప్పినట్లు సమాచారం. జరగబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే కచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం మరో సిద్దిపేట అయ్యా రీతిలో అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు మంత్రి హరీష్ రావు మాట ఇస్తున్నారట. ఏది ఏమైనా జరగబోయే ఉప ఎన్నిక నో టిఆర్ఎస్ సత్తా చాటాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తుందట.


Share

Related posts

Nimmagadda Ramesh Kumar బిగ్ బ్రేకింగ్ : ప్రివిలేజ్ కమిటీకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్..!!

sekhar

ఆవేశంలో చేసిన సవాల్.. గంటా రాజకీయ భవిష్యత్తును శాసిస్తోందా..?

Muraliak

Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!

bharani jella