NewsOrbit
రాజ‌కీయాలు

బీఫ్ తినలేదు.. డోక్లా తిన్నారా?

ప్రధాని మోదీపై అసదుద్దీన్ విమర్శలు
హైదరాబాద్: పుల్వామా ఉగ్రవాద దాడి అంశంలో ప్రధాని మోదీని విమర్శించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆయననే టార్గెట్ చేశారు. ముందుగా సోషల్ మీడియా ద్వారా ఎంఐఎంకు ఓట్లు వేయాలని, ఓటింగు శాతాన్ని పెంచాలని అభ్యర్థించారు. గత వారం మోదీ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులను ట్యాగ్ చేస్తూ ఓటింగుపై అవగాహన కల్పించాలని కోరారు. తాజాగా ఒవైసీ మరోసారి మోదీని టార్గెట్ చేశారు. ‘‘రెండు రోజుల క్రితం నేనో మాట అన్నాను. పుల్వామాలో ఆత్మాహుది దాడి జరిగి జవాన్లు మరణించినపుడు ప్రధాని మోదీ బాధ్యత తీసుకుంటారా అని అడిగాను. కానీ ఆయన బీఫ్ బిర్యానీ తిని నిద్రపోతున్నారని చెప్పాను. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్లు ఆయన మాంసాహారం తినరని చెప్పారు. ఆయన ఏం తింటారో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన డోక్లా, ఇడ్లీ లేదా వెజిటబుల్ బిర్యానీ తిని నిద్రపోయారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో బీజేపీ టీషర్టులు, ఇతర వస్తువులు బయటకు తేవడాన్ని కూడా విమర్శించారు. ‘‘వ్యాపారవేత్తలంతా జీఎస్టీ విషయంలో తమను వేధిస్తున్నారని బాధపడుతున్నారు. ఇంకా, మోదీ మాత్రం టీషర్టులు అమ్ముతున్నారు. ఏం చౌకీదార్ ఈయన.. జెట్ ఎయిర్ వేస్ మునిగిపోయింది. ఈ చౌకీదార్ ఆ సంస్థకు రూ. 1500 కోట్లు ఇవ్వాలని బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నారు. మేకిన్ ఇండియా పేరుతో వేలాది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. వాళ్లకు కూడా రుణాలు ఇవ్వగలరా?’’ అని అన్నారు. ‘‘రూ. 1500 కోట్లు ఎలా పడితే అలా ఇచ్చేస్తారా? ఇదేమైనా మీ బాబు సొమ్మా’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ను పాకిస్థానీ ఉగ్రవాది మసూద్ అజహర్ బంధువని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనడాన్ని కూడా ఒవైసీ విమర్శించారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Leave a Comment