NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విద్యార్థుల తల్లిదండ్రులకు షాకిచ్చిన హైకోర్టు ఉత్తర్వులు! అసలు విషయం ఏమిటంటే??

ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంపై పై హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కోర్టుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన విషయం అటుంచితే ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

High Court orders saddening parents of students
High Court orders saddening parents of students

ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాకు తెర దించే సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది.టిడిపి హయాంలో నారాయణ చైతన్య తదితర విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను భారీగా దోచుకున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలు ఏర్పరిచే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.చైర్మన్ రెడ్డి కాంతారావు ఆధ్వర్యంలో ఈ కమిషన్ అనేక విద్యాసంస్థలను సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది ఇకపై ఫీజుల నియంత్రణ పూర్తిగా ఈ కమిషన్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది.

ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యాసంస్థలు ఈ కమిషన్ దృష్టికి తేవాలని ఆదేశించింది.ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల నియామకాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. ప్రభుత్వ సిలబస్‌ను కచ్చితంగా పాటించాలని, ఏస్కూల్‌కు ఆ స్కూల్ తమకు నచ్చిన సిలబస్ చెప్పుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పింది.దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల గొంతులో వెలక్కాయ పడినట్లైంది.వెంటనే సంబంధిత సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కమిషన్ పేరుతో ప్రభుత్వం తమపై ఆధిపత్యం చెలాయించడం కుదరదని, తమ ఫీజులు తామే నిర్ణయించుకుంటామని, ఫీజులు తగ్గిస్తే.. విద్యా ప్రమాణాలు పడి పోతాయంటూ హైకోర్టుకి విన్నవించుకుంది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కాంతారావు కమిషన్ కార్యకలాపాలపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు సంబరాలు చేసుకుంటుండగా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం డీలా పడిపోయారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఫీజుల భారం తగ్గుతుందని ఆశించిన విద్యార్థుల తల్లిదండ్రులకు హైకోర్టు స్టే ఆర్డర్ షాక్ ఇచ్చింది.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju